For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bimbisara సినిమాను మొదట రిజెక్ట్ చేసిన మాస్ హీరో.. ఆ భయంతోనే రిజెక్ట్..

  |

  కళ్యాణ్ రామ్ నటించిన బాంబిసార సినిమా ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటోంది. అయితే ఈ సినిమా దర్శకుడు వశిష్ట బింబిసార కథను మొదట మరొక హీరోకి కూడా చెప్పాడట. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న వశిష్టకు దాదాపు తన ఏజ్ లో ఉన్న హీరోలందరితో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఆ పరిచయంతో వశిష్ట మొదట బింబిసార కథను ఒక ప్రముఖ హీరోకు చెప్పాడట. కానీ అతను ఒక భయం కారణంగా ఒప్పుకోలేదట. ఆ వివరాల్లోకి వెళితే..

  నందమూరి హీరోల హవా

  నందమూరి హీరోల హవా


  నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ ఎన్టీఆర్ ఇటీవల కాలంలో వరుసగా బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. మొదట నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేయగా ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. RRR సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

   బింబిసార పాజిటివ్ టాక్

  బింబిసార పాజిటివ్ టాక్

  బింబిసార మొదటి రోజు 6 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకొని కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఒపెనింగ్స్ అందుకుంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. ఇక విడుదలైన అనంతరం రివ్యూలు పాజిటివ్ గా ఉండడం అలాగే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు కూడా సాలీడ్ కలెక్షన్స్ వచ్చాయి. కొన్ని ఏరియాల్లో అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఫినిష్ అయ్యింది.

  అదే సెంటిమెంట్

  అదే సెంటిమెంట్

  మూడవ రోజు నుంచి బింబిసార సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్స్ అందుకోనుంది. అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కూడా అఖండ, RRR సెంటిమెంటుతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ రెండు సినిమాల్లో అనుకోకుండా చిన్న పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక బింబిసార సినిమాలో కూడా అదే ప్లస్ పాయింట్ అయ్యింది.

  మొదట వేరే హీరోలకు

  మొదట వేరే హీరోలకు

  కొత్త దర్శకుడు అయినప్పటికీ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించిన విధానంపై కూడా ప్రముఖ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వశిష్ట ఇంతకుముందు ఈ కథను కొంతమంది హీరోలకు కూడా చెప్పడం జరిగిందట. అయితే ఒక హీరో కూడా మొదట పాజిటివ్ గానే స్పందించి ఆ తర్వాత మళ్లీ రిస్క్ గా అనిపించి రిజెక్ట్ చేశాడట.

  Recommended Video

  Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
  రవితేజ రిజెక్ట్?

  రవితేజ రిజెక్ట్?

  బింబిసార కాన్సెప్ట్ మొదటి రిజెక్ట్ చేసిన హీరో మరెవరో కాదు రవితేజ అని తెలుస్తోంది. రవితేజకు వశిష్టకు మంచి పరిచయం ఉంది. అయితే బిబిసార కథపై మొదట రవితేజ కొన్ని రోజులపాటు చర్చలు కూడా జరిపాడు. అయితే అందులో నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయి అని ఒక చిన్న పాపను చంపే క్యారెక్టర్ అతనికి అంతగా నచ్చలేదట. దానితోపాటు కొత్త దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాను ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు అనే విషయంలో కాస్త భయపడ్డాడట. అందుకే ఆ సినిమాను చేయడానికి రవితేజ ఒప్పుకోలేదనీ తెలుస్తోంది.

  కళ్యాణ్ రామ్ నమ్మకంతో..

  కళ్యాణ్ రామ్ నమ్మకంతో..


  ఇక కళ్యాణ్ రామ్ వశిష్ట దగ్గర ఉన్న స్టోరీ లైన్ గురించి తెలుసుకొని అతనితో కొన్ని రోజులపాటు ట్రావెల్ అయ్యాడట. నమ్మకం గా అనిపించడంతో సొంతంగా గ్రాఫిక్స్ కు సంబంధించిన స్టూడియో కూడా ఉంది కాబట్టి పక్క ప్రణాళికను సిద్ధం చేసుకున్న తరువాత సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ నమ్మినట్లుగానే దర్శకుడు వశిష్ట అద్భుతమైన మేకింగ్ తో బాక్సాఫీస్ హిట్ ను అంధించాడు. ఇక బాంబిసార 2ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

  English summary
  Kalyan ram latest movie Bimbisara first rejected hero in long back
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X