మొత్తానికి 'కత్తి' కాపాడుకున్న కళ్యాణ్ రామ్
కళ్యాణ్ సినిమా కొత్త సినిమా టైటిల్ వివాదంలో పడిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ అనుకున్న 'కత్తి' టైటిల్ ని ప్రముఖ నిర్మాత దానయ్య ఆల్రెడీ రిజిస్టర్ చేసేయటం ఈ సమస్య వచ్చింది. అయితే బైరసారాలు లేకుండా కేవలం రాయబారాలునే ఈ సమస్య తీరిందని తెలుస్తోంది. దాంతో అఫీషయల్ గా తన చిత్రానికి కత్తి అనే టైటిల్ ని ప్రకటించారు కళ్యాణ్ రామ్. ఇక ఈ టైటిల్ సమస్య తీరకపోతే కళ్యాణ్ రామ్..మహేష్ బాబు టైటిల్ రూటులోకి వచ్చి "కళ్యాణ్ రామ్ కత్తి" అని పెట్టడానికి నిర్చయించుకున్నారు. అయితే తాజాగా ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు అటువంటి టైటిల్ ముందు పెట్టే పదాలు ఏక్సెప్ట్ చేయబోమని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయిం తీసుకోవటంతో రాజీకి వెళ్ళక తప్పలేదు.
ఒకే రకమైన శబ్దం వచ్చే పదాలును టైటిల్స్ గా పెట్టకూడదని ఫిల్మ్ ఛాంబర్ అటువంటిది జరిగితే ఒరిజనల్ గా ఎవరి టైటిల్ ముందు రిజిస్టర్ చేసారో వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని రూల్ పెట్టారు. కాబట్టి ఇక కళ్యాణ్ రామ్ కత్తే అని ఫిక్సవచ్చు. సినిమా కూడా టైటిల్ కు తగ్గట్లే కత్తి లాగ ఉంటే బావుంటుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం ద్వారా సనా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె ఇంతకుముందు ఓ తమిళ చిత్రం చేసింది. ఇక విలేజ్ లో వినాయకుడు చిత్రంలో చేసిన శరణ్యా మోహన్..కళ్యాణ్ రామ్ చెల్లిగా కీరోల్ చేస్తోంది. రవితేజ కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా చేసిన శ్యామ్ మరో కీలకపాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందించే ఈ చిత్రం తనకు మరో సూపర్ హిట్ ని అందిస్తుందని కళ్యాణ్ రామ్ నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











