For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్టీస్టారర్ కోసం కథ సెట్ చేసిన కళ్యాణ్ రామ్.. రిజెక్ట్ చేసిన బాలయ్య.. తారక్ షాక్..?

    |

    సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా ఫ్యామిలీ కూడా మల్టీస్టారర్ కథలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటే.. ముందుగానే ఒక మల్టీస్టారర్ చేసిన అక్కినేని వారు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దగ్గుబాటి హీరోలు కూడా రెడీ అవుతున్నారు. కానీ నందమూరి వారే ఇంకా ఎలాంటి మల్టీస్టారర్ చేయలేదు.

    తారక్ చేయకపోవడమే మంచిదైంది..

    తారక్ చేయకపోవడమే మంచిదైంది..

    ఆ మధ్య బాలకృష్ణతో కళ్యాణ్ రామ్ మహనాయకుడిలో కనిపించినప్పటికి అసలైన జూనియర్ ఎన్టీఆర్ నటించకపోవడం ఆడియెన్స్ ని నిరాశకు గురి చేసింది. పైగా ఆ సినిమా కూడా దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. ఓ విధంగా తారక్ చేయకపోవడమే మంచిదయ్యింది అనే విధంగా కామెంట్స్ వచ్చాయి.

    మల్టీస్టారర్ కోసం కథ సెట్ చేసిన కల్యాణ్ రామ్..

    మల్టీస్టారర్ కోసం కథ సెట్ చేసిన కల్యాణ్ రామ్..

    ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ ని నటించమని కోరినప్పటికీ ఎందుకో తారక్ చేయలేదనే రూమర్స్ వచ్చాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం నందమూరి మల్టీస్టారర్ కోసం కళ్యాణ్ రెండు కథలను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచే కళ్యాణ్ రామ్ కథలను సెర్చ్ చేసే పనిలో ఉన్నాడట.

    బాలకృష్ణ రిజెక్ట్ చేశాడా?

    బాలకృష్ణ రిజెక్ట్ చేశాడా?

    అందులో ఒక కథ పై ఎన్టీఆర్ పాజిటివ్ గా స్పందించి సరైన దర్శకుడు దొరికితే చేద్దామని చెప్పాడట. కానీ బాలకృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. కథ నచ్చలేదో మరి సినిమా చేయడం ఇష్టం లేదో..గాని బాలకృష్ణ చేయలేనని డైరెక్ట్ గా నో చెప్పేశాడట. దీంతో తారక్ కాస్త ఆశ్చర్యనికి గురై.. బాబాయ్ కి నచ్చిన కథ దొరికే వరకు వెయిట్ చేద్దామని కళ్యాణ్ రామ్ కు చెప్పాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది.

    Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
    సొంత ప్రొడక్షన్ లోనే మల్టీస్టారర్..

    సొంత ప్రొడక్షన్ లోనే మల్టీస్టారర్..

    ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని చాలా రోజులుగా అయితే కళ్యాణ్ రామ్ తన సొంత ప్రొడక్షన్ లోనే తమ్ముడితో అలాగే బాబాయ్ తో ఒక పవర్ఫుల్ సినిమా చేయాలని సరైన కథ కోసం వెతుకుతున్నాడు. రైటర్స్ కి కూడా కొత్త ఐడియాలు ఇచ్చి కథలను డెవలప్ చేయిస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ మల్టీస్టారర్ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

    English summary
    Josh has been among the fans since yesterday as the Nandamuri star lion Balakrishna has celebrated his 60th birthday. Since this morning, fans have been telling Birthday Wishes to their favorite hero via social media. Also, the movie stars individually giving special poems to Balayya. Junior NTR also showed his affection for his uncle with an emotional tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X