త్రివిక్రమ్, నందమూరి కాంబినేషన్‌లో మరో చిత్రం.. హీరో ఎవరంటే!
Recommended Video

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టే దిశగా సాగుతోంది. ఎన్టీఆర్ గతంలో కూడా ఫ్యాషన్ తరహా చిత్రంలో నటించాడు. కానీ అరవింద సమేత విభిన్నమైనది. అరవింద సమేతతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు మెమొరబుల్ హిట్ అందించాడు. త్రివిక్రమ్ తదుపరి చిత్రాల గురించి చాలా రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సమీప భవిష్యత్తులో త్రివిక్రమ్, నందమూరి కాంబోలో మరో సినిమా ఉంటుందనేది లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

ఎన్టీఆర్‌కు ఆప్తుడిగా
అరవింద సమేత చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు ఆప్తుడిగా మారిపోయారని ఎన్టీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే. అంతలా వీరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ లుక్ లో చూపించారు.

కళ్యాణ్ రామ్ నిర్మాణంలో
తాజాగా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఓ చిత్రం చేసేందుకు త్రివిక్రమ్ అంగీకరించారట. కళ్యాణ్ రామ్ హీరోగా మాత్రమే కాక నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ కిక్2, జై లవకుశ వంటి చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే.

యువ హీరోతో
ఈ చిత్రంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాకుండా మరో యువ హీరో నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం కమిటై ఉన్న చిత్రాలు పూర్తి చేసిన తరువాత కళ్యాణ్ రామ్ సినిమాపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ హీరోగా
అరవింద సమేత చిత్రం తరువాత త్రివిక్రమ్ ఇంకా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ ఎవరివైపు మొగ్గు చూపుతారో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











