జూ.ఎన్టీఆర్‌తో కలసి, కళ్యాణ్ రామ్ అలా అనుకున్నాడా.. కోరిక తీరకముందే హరికృష్ణ మృతి!

Recommended Video

Kalyan Ram's Desire Not Fulfilled

నందమూరి హరికృష్ణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు శోకంలో మునిగిపోయారు. ఆయన అకాల మరణం అందరిని కలచి వేస్తోంది. సినీరాజకీయ ప్రముఖులు హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ సినిమా రంగంలో బాగా రాణిస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరో మాత్రమే కాక స్వతహాగా నిర్మాత కూడా. హరికృష్ణ ఆకస్మిక మరణంతో కళ్యాణ్ రామ్ కోరిక తీరని కలగానే మిగిలిపోయిందనేది సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్న విషయం.

సినిమాలకు గ్యాప్

సినిమాలకు గ్యాప్

హరికృష్ణ చివరగా 2005 లో శ్రావణ మాసం చిత్రంలో నటించారు. ఆ తరువాత వెండి తెర నుంచి ఆయన విరామం తీసుకున్నారు. అటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా లేరు. కుటుంబం కోసం సమయం వెచ్చిస్తూ, స్నేహితులతో సన్నిహితంగా ఉండేవారు.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ హీరోగానే కాక పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. గత ఏడాది కళ్యాణ్ రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన జైలవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. తాను కూడా హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ తమ్ముడితో సినిమా నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

 ఎప్పటి నుంచో

ఎప్పటి నుంచో


సోదరుడు ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, తాను కలసి ఓ చిత్రంలో నటించాలని కళ్యాణ్ రామ్ కు కోరికగా ఉండేదట. జైలవకుశ చిత్రం విజయం సాధించిన తరువాత తాను, తమ్ముడు, నాన్న హరికృష్ణ కలసి నటించేలా మంచి కథతో రావాలని కొందరు రచయితలకు సూచనలు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

 కలగానే

కలగానే


కానీ హరికృష్ణ అకాల మరణంతో ఆ కోరిక కలగానే మిగిలిపోయింది. హరికృష్ణ సినిమా రాజకీయ రంగాల్లో తండ్రికి తగ్గ తనయుడు అని ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు.

 ఆడియో వేడుకలలో

ఆడియో వేడుకలలో

ఈ మధ్య కాలంలో హరికృష్ణ తన తనయులు నటించిన చిత్రాల ఆడియో వేడుకలకు హాజరవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం నందమూరి అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X