తనకు ఫ్లాఫ్స్ ఇచ్చిన డైరక్టర్ తోనే మళ్ళీ

By Srikanya

Kalyan Ram’s new film on May 15th
హైదరాబాద్ : తనకి నచ్చిన డైరక్టర్ కి హిట్ ఇవ్వాలనా లేక తనకు హిట్ రావాలనా అనేది కళ్యాణ్ రామ్ కోరిక అనేది అర్దం కావటం లేదు అంటున్నారు. తనకు గతంలో అభిమన్యు,కత్తి చిత్రాలుతో ఫ్లాఫ్ లు ఇచ్చిన మల్లి కార్జున్ తో నందమూరి కళ్యాణ్ రామ్ మరో చిత్రం చేయటానికి సిద్దమయ్యారు. మే 15న ఈ చిత్రం ప్రారంభం కానుంది. కొమరం వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మరో ప్రక్క హీరోగా తనకు కలిసి రాక పోవడంతో కళ్యాణ్ రామ్ తన దృష్టంతా సినిమా నిర్మాణ రంగంపైనే పెట్టారు. త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా 'కిక్ 2' చిత్రాన్ని నిర్మించేందుక ప్లాన్ చేస్తున్నారు. తనతో చేయబోయే 'కిక్ 2' చిత్రానికి ముందు సురేందర్ రెడ్డి 'రేసు గుర్రం'తో హిట్ కొట్టడమే కళ్యాణ్ రామ్ సంతోషానికి కారణం.

ఒక దర్శకుడు హిట్ కొట్టిన తర్వాత తీసే సినిమాకు మార్కెట్లో క్రేజ్ బాగా ఉంటుంది. ఇది తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'పవర్' చిత్రం పూర్తి కాగానే 'కిక్ 2' చిత్రం ప్రారంభం కానుంది. . 'కిక్' మూవీ అప్పట్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో....అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కిక్-2 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ సొంత బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో 'అతనొక్కడే' చిత్రం తర్వాత ఒక్క హిట్ట కూడా లేదు. ఈ నేపథ్యంలో 'కిక్ 2' చిత్రం తన బేనర్‌కు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాడు కళ్యాణ్ రామ్. తన సొంత బేనర్లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన నాలుగు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X