మొదట కాదన్నా... :కళ్యాణ్ రామ్ డైరక్టర్ తో రామ్ నెక్ట్స్

By Srikanya

హైదరాబాద్ : మొదట నమ్మకం లేక కాదన్నా తర్వాత వారి ప్రతిభ చూసి ఆఫర్స్ ఇవ్వటం...ఇండస్ట్రీలో అతి సహజం. అలాంటి సంఘటన రీసెంట్ గా ఒకటి జరిగిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదేమిటంటే....గతంలో కందిరీగ, ఆగడు చిత్రాలకు స్క్రిప్టు వర్క్ చేసి, మసాలా చిత్రానికి డైలాగు రైటర్ గా వ్యవరించిన అనీల్ రావిపూడి ఇప్పుడు దర్శకుడుగా మారిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ టైటిల్ తో రెడీ అవుతున్న చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి...పాజిటివ్ టాక్ రావటంతో రామ్ పిలిచి కథ విన్నట్లు తెలుస్తోంది.

https://www.facebook.com/TeluguFilmibeat

రవికిషోర్ సైతం నిర్మించనున్న ఈ చిత్రం కథ ఈ మధ్యనే నేరేట్ చేసినట్లు, ఆ కథ వీరిద్దరికి బాగా నచ్చినట్లు సమాచారం. ఈ మేరకు అనీల్ కు అడ్వాన్స్ సైతం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మొదట రామ్ తోటే అనీల్ రావిపూడి లాంచ్ అవుతారని అంతా అనుకున్నారు. అయితే రామ్ తాను ఫ్లాఫ్ ల్లో ఉండటంతో ధైర్యం చేయలేకపోయారని వినికిడి. ఆ తర్వాత రానా తో చాలా కాలం పటాస్ కథపై డిస్కషన్స్ చేసారు. అయితే సురేష్ బాబు సైతం ఎంతకాలానికి ప్రాజెక్టు ఓకే చేయకపోవటంతో కళ్యాణ్ రామ్ కి కథ చెప్పి సినిమా ప్రారంభించారు.

Kalyan Ram's Phataas Director signed his next

‘పటాస్‌' విషయానికి వస్తే...

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘పటాస్‌' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా గురించి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. త్వరలో ఆడియోను, చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని తెలిపారు.

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

మరో ప్రక్క టెంపర్‌' మీదన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాకు ఈ చిత్రం పోటీ వస్తుందా అనే అనుమానంలో నందమూరి అభిమానులు ఉన్నారు.
టెంపర్‌ పోస్టర్‌ విడుదల చేసిన కొన్ని గంటలకే పటాస్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కథ విషయానికి వస్తే అటు టెంపర్‌లోనూ ఇటు పటాస్‌లోనూ ఇద్దరూ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో కనిపిస్తుండడం విశేషం.

టెంపర్‌ కన్నా ముందే పటాస్‌ విడుదల అయ్యే అవకాశం ఉందనే టాక్‌ వినబడుతోంది. చాల కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బందులు పడుతున్న కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రంతోనైనా హిట్‌ సాధించాలనుకుంటున్నాడు. ఈ చిత్ర ఆడియో త్వరలో విడుదల చేసే ఆలోచనలో రామ్‌ ఉన్నారు. సాయికార్తీక్‌ సంగీతం సమకూర్చగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: సర్వేశ్‌ మురారి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X