మహేష్ రూటులోకి వెళ్ళినా కళ్యాణ్ రామ్ కి నో
కళ్యాణ్ సినిమా కొత్త సినిమా టైటిల్ కత్తి అని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా టైటిల్ వివాదంలో పడింది. ప్రముఖ నిర్మాత దానయ్య ఈ 'కత్తి' టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేసారు. దాంతో కళ్యాణ్ రామ్..మహేష్ బాబు టైటిల్ రూటులోకి వచ్చి "కళ్యాణ్ రామ్ కత్తి" అని పెట్టడానికి నిర్చయించుకున్నాడని సమాచారం. అయితే తాజాగా ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు అటువంటి టైటిల్ ముందు పెట్టే పదాలు ఏక్సెప్ట్ చేయబోమని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయిం తీసుకుంది. ఒకే రకమైన శబ్దం వచ్చే పదాలును టైటిల్స్ గా పెట్టకూడదని ఫిల్మ్ ఛాంబర్ అటువంటిది జరిగితే ఒరిజనల్ గా ఎవరి టైటిల్ ముందు రిజిస్టర్ చేసారో వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని రూల్ పెట్టారు. దాంతో మల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కత్తి అనే టైటిల్ పెట్టుకోవటానకి లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ టైటిల్ వేటలో పడ్డారు.


Click it and Unblock the Notifications











