కళ్యాణ్ రామ్ అంతకు మించి షాక్ ఇవ్వబోతున్నాడా? బాహుబలి, పుష్ప కంటే ఎక్కువగా..
రానున్న రోజుల్లో మిగతా ఇండస్ట్రీలో మార్పులు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడం కష్టంగాని.. మన తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం ఎవరు ఊహించని రేంజ్ లో మార్పులు చోటు చేసుకుంటామని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విదంగా వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకి రాబోతున్నాయి. ఇక కళ్యాణ్ రామ కూడా ఒక భారీ ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పవర్ఫుల్ హిట్ కొట్టడానికి
నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు బాలయ్య మరోవైపు తారక్ ఇద్దరు కూడా వారి రేంజ్ ను కొంచెంకొంచెంగా పెంచుకుంటూ వెళుతున్నారు.. ఇక వారికంటే కాస్త తక్కువ మార్కెట్ ఉన్న కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది .

ఆ దర్శకులకు మొదటి ఛాన్స్
సొంతంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే అనేక రకాల సినిమాలను నిర్మించిన కళ్యాణ్ రామ్ ఎంతో మంది దర్శకులకు కూడా లైఫ్ ఇచ్చాడు. అతనొక్కడే దర్శకుడు సురేంధర్ రెడ్డి, పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ సపోర్ట్ తోనే మొదటి ఛాన్స్ అందుకొని ఇప్పుడు స్టార్ దర్శకులుగా కొనసాగుతున్నారు.

మరొక పబర్ఫుల్ దర్శకుడిని..
అయితే అదే తరహాలో విశిష్ట్ అనే మరో పవర్ఫుల్ దర్శకుడిని కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఒక బిగ్ బడ్జెట్ సినిమాతో వశిష్ట్ ను పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లోనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఆ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారా లేక ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారా అనేది రేపు తెలుస్తుంది.

మూడు భాగాలుగా కొత్త సినిమా
ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తారని టాక్ వస్తోంది. ఇప్పటివరకు బాహుబలి మాత్రమే ఆ ఫార్మాట్ లో హిట్ కొట్టింది. ప్రస్తుతం పుష్ప రెండు భాగాలుగా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ సోషియో ఫాంటసీ కథ మాత్రం అంతకు మించి అనేలా రూపొందనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











