కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం కొత్త దర్శకుడుతో..డిటేల్స్
కొత్త టాలెంట్ లను వెండితెరకు పరిచయం చేయటంలో ముందుండే నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా మరొకరని దర్శకుడు చేస్తున్నారు. సునీల్.కె.రెడ్డి అనే కెమెరామెన్ చెప్పిన కథను విన్న కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ ప్రాజెక్టు గా ఈ చిత్రాన్ని చేయనున్నారు. సునీల్ కె రెడ్డి గతంలో ఒకరికి ఒకరు, భగీరధ, నేను మీకు తెలుసా చిత్రాలకు తెలుసా చిత్రాలుకు చేసారు. ఇక నవంబర్ 5 న కళ్యాణ్ రామ్ కత్తి రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ న్యూస్ బయిటకు వచ్చింది. ఇక కొద్ది రోజులుగా ఈ చిత్రం స్టోరీ డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం ద్వారా సనా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె ఇంతకుముందు ఓ తమిళ చిత్రం చేసింది. ఇక విలేజ్ లో వినాయకుడు చిత్రంలో చేసిన శరణ్యా మోహన్..కళ్యాణ్ రామ్ చెల్లిగా కీరోల్ చేస్తోంది. రవితేజ కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా చేసిన శ్యామ్ మరో కీలకపాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందించే ఈ చిత్రం తనకు మరో సూపర్ హిట్ ని అందిస్తుందని కళ్యాణ్ రామ్ నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











