మళ్ళీ కళ్యాణ్ రామ్..సురేంద్రరెడ్డి డైరక్షన్ లో?
సురేంద్రరెడ్డి దర్శకత్వంలో మరోసారి కళ్యాణ్ రామ్ చేయనున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కిక్ చిత్రాన్ని రూపొందించుతున్న సురేంద్రరెడ్డి ..ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రకి కళ్యాణ్ రామ్ ని ఎంపికచేసినట్లు సమాచారం. అతనొక్కడే చిత్రంతో తనని పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ ని బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా కృతజ్ఞత తీర్చుకున్నట్లు చెప్తున్నారు. ఇక కిక్ చిత్రాన్ని తెలుగులో రవితేజ,శ్యామ్ కాంబినేషన్ లో చేసారు. ఇలియానా హీరోయిన్ గా చేసింది. హిందీలో ఆ పాత్రను అమృతారావు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమృతారావు ఇంతకు ముందు సురేంద్రరెడ్డి దర్సకత్వంలో అతిధి చిత్రంలో చేసింది.
సురేంద్రరెడ్డి కళ్యాణ్ రామ్ అతనొక్కడే కిక్ రవితేజ ఇలియానా అతిధి మహేష్ అమృతారావు శ్యామ్ suredra reddy kalyana ram atanokkade kick raviteja iliyana athidi mahesh amrutharao


Click it and Unblock the Notifications