పవన్ హీరోయిన్స్ ఇద్దరినీ కళ్యాణ్ రామ్
పవన్ కళ్యాణ్ సరసన చేసిన హీరోయిన్స్ పై కళ్యాణ్ రామ్ కన్నుపడింది.ఆయనతో చేసిన నిఖిషా పటేల్, కృతి కర్బందాలను ఇద్దరినీ తన సినిమాలో కళ్యాణ్ రామ్ తీసుకున్నారు.సునీల్ అనే కెమెరామెన్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.ఈ చిత్రం పక్కా మాస్ మసాలా వంటకమని తెలుస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.అక్టోబరు నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. అందుకోసం ఆయన ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నారు. చిజిల్డ్ బాడీతో కనిపిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ తో కొమరం పులి చిత్రంలో చేసిన నిఖిషా పటేల్ ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ సంపాదించలేకపోయింది.అయితే ల్యాంగ్ గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమాలో బుక్కైంది.అలాగే 'తీన్‌మార్'లో కనిపించిన కృతి కర్బందాకి ఆ తర్వాత ఆఫర్సే రాలేదు.ఇన్నాళ్ళకు కళ్యాణ్ రామ్ కరుణించాడు.


Click it and Unblock the Notifications











