సూపర్‌స్టార్ కుమారుడితో కల్యాణి ప్రియదర్శన్ పెళ్లి. పీకల్లోతు ప్రేమలో..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకొంటున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. తెలుగు, తమిళంలో తనదైన నటనతో ఆకట్టుకొంటున్న ఈ బ్యూటీ కొద్దికాలంగా ఓ సూపర్ స్టార్ కుమారుడి ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే కల్యాణి అఫైర్ విషయం ప్రస్తుతం దక్షిణాది మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై కల్యాణి మాత్రం లీకులు ఇస్తూనే ఉండటం గమనార్హం. ఇంతకు ఆ సూపర్ స్టార్ కుమారుడు ఎవరంటే..

హలో అంటూ తెలుగులో

హలో అంటూ తెలుగులో

తల్లిదండ్రుల సినీ వారసత్వాన్ని పుచ్చుకొని తెరపైకి వచ్చిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ దంపతుల కుమార్తెగా కల్యాణి దక్షిణాదిలో సుపరిచితులు. ఇప్పటికే హలో, చిత్రలహరి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఇక శివ కార్తీకేయన్ హీరోగా దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందే సినిమా ద్వారా తమిళంలోకి ప్రవేశించనున్నారు.

సూపర్‌స్టార్ కొడుకుతో

సూపర్‌స్టార్ కొడుకుతో

కెరీర్‌ను ఓ పక్క చక్కదిద్దుకొంటూనే మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో ప్రేమలో పడిందనే రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రేమలో పడిన విషయం నిజమే అని చెప్పారు. దాంతో ఆమె ఎవరితో ప్రేమలో పడిందనే విషయం చర్చనీయాంశమైంది. కాగా వారిద్దరి ఫోటోలు ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇరు కుటుంబాల మధ్య రిలేషన్స్

ఇరు కుటుంబాల మధ్య రిలేషన్స్

ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోహన్‌లాల్, ప్రియదర్శన్ కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మోహన్‌లాల్, ప్రియదర్శన్ మధ్య సినీపరంగానే కాకుండా వ్యక్తిగతమైన రిలేషన్స్ ఏన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శన్ మధ్య ప్రేమపై ఇరు కుటుంబాలు సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇరుకుటుంబాలు తీసుకొనే నిర్ణయంపైనే వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్తుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రియదర్శన్, మోహన్ లాల్ కలిసి 30 సినిమాలు

ప్రియదర్శన్, మోహన్ లాల్ కలిసి 30 సినిమాలు

ఇక దక్షిణాదిలో ప్రియదర్శన్, మోహన్ లాల్ కాంబినేషన్‌కు క్రేజీ పేరుంది. దాదాపు ఈ ఇద్దరు సినీ ప్రముఖులు 30కి పైగా చిత్రాలకు కలిసి పనిచేశారు. దాంతో వారిద్దరూ సన్నిహితులుగా, స్నేహితులుగా మారిపోయారు. ఇప్పుడు వారి పిల్లలు ప్రేమకు వీరి స్నేహం సహకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X