కమల్‌ 'చీకటి రాజ్యం' కథ ఇదే నంటూ ప్రచారం

By Srikanya

హైదరాబాద్ : ఏదేని చిత్రం ఫస్ట్ల్ లుక్ లేదా ట్రైలర్ రిలీజైన వెంటనే ఆ చిత్రం కథ ఇదిగో అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చేస్తోంది. తాజాగా . కమల్‌ హీరోగా రాజేష్‌ ఎమ్‌.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పేరే... 'చీకటి రాజ్యం'. త్రిష హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రీసెంట్ గా వీడుదల చేసారు. అందులో ...కమల్ ...అవతలి వ్యక్తి ఎవరనేది చూపకుండా ముద్దు పెట్టుకునే పోస్ట్రర్ అందరిలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ అంటూ ఒకటి తమిళ సినీ వర్గాల్లో ప్రచారంలోకి వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళ వర్గాలు చెప్పుకునేదాన్ని బట్టి... ఈ చిత్రంలో కమల్ ...తన ముద్దుతో అందరినీ చంపేసే సీరియల్ కిల్లర్ తరహా పాత్రను పోషిస్తున్నాడు అంటున్నారు. అయితే పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో చేస్తున్నట్లు కమల్ ప్రకటించారు. పోలీస్ అధికారి, సీరియల్ కిల్లర్ ఒకరేనా అన్న యాంగిల్ లో కథనం నడుస్తుందని, స్క్రీన్ ప్లే ప్రధాన చిత్రం అని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో కానీ పోస్టర్ ని చూసి కథ అల్లిసినట్లు మాత్రం అనిపిస్తోంది.

Kamal Cheekati Rajyam Story line : killing with a kiss?

అప్పట్లో 'ఆకలి రాజ్యం' అన్నారు కమల్‌ హాసన్‌. ఇప్పుడు 'చీకటి రాజ్యం' అంటున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మిస్తున్నారు.

కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ''ఇదివరకు ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడిగారు. త్వరలోనే చేస్తానని చెప్పా. కానీ ఎవ్వరూ నమ్మలేదు. నేను మాత్రం నా మాటని నిలబెట్టుకొంటూ 'చీకటి రాజ్యం'మొదలుపెట్టా. ఈ సినిమాతో ఆగను. ఇకపై తరచుగా తెలుగులో సినిమాలు చేస్తుంటా. రాజేష్‌ నా శిష్యుడు. ఏడేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికి తనతో సినిమా చేయడం కుదిరింది. ప్రస్తుతం రాజేష్‌కి నేనొక బాలచందర్‌లా కనిపిస్తున్నా.

నా గురువు బాలచందర్‌గారితో 37 సినిమాలకు కలిసి పని చేశాను. చివరి సినిమా 'ఉత్తమవిలన్‌' చేశాక ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన లక్షణాలు నాలో కొన్ని కనిపిస్తున్నాయి. నా కోపం, నటన అన్నీ బాలచందర్‌గారి నుంచి వచ్చినవే. 'చీకటి రాజ్యం' ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. సినిమా అనేది ఎవరి కారణంగా విజయం సాధిస్తుందో చెప్పలేం. 'షోలే'లో అందరికీ గబ్బర్‌సింగ్‌ పాత్రే గుర్తుంటుంది. అలా ఏ సినిమాతో ఎవరికి గుర్తింపు లభిస్తుందో తెలియది''అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఓ వరం. ఆ వరాన్ని కాపాడుకొంటూ అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమాని తీస్తాను''అన్నారు. 'కమల్‌హాసన్‌ సినిమాకు పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది'' అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి.

ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ''కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి సినిమా గురించి చెప్పారు. తెలుగులోనూ తీయాలనుకొంటున్నాను అన్నారు. 'కమల్‌ ఓ మహానది. ఆ నది తెలుగుభాషని తాకుతూ వెళితే అంతకంటే ఆనందం ఏముంటుంది? అందుకే ప్రేక్షకులు కూడా అదే కోరుకొంటున్నారు' అని కమల్‌తో చెప్పాను''అన్నారు.

''ఇదివరకు ఎప్పుడూ చేయని ఓ కొత్త తరహా పాత్ర పోషించే అవకాశం లభించింది. కమల్‌ హాసన్‌ సర్‌తో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది''అని చెప్పింది త్రిష. కిషోర్‌, సంపత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: విజయ్‌శంకర్‌, కళ: ప్రేమ్‌నివాస్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X