కల్కిలో కమల్ పాత్ర 20 నిమిషాలు.. విశ్వ నటుడు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ అంటే?
విశ్వ నటుడు కమల్ హాసన్ విక్రమ్ తర్వాత తన జోరు పెంచిన విషయం తెలిసిందే.
చాలా కాలం తర్వాత విక్రమ్ ఇచ్చిన హిట్ తో కమల్ హాసన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ఒకపక్క హీరోగా, ఇంకోపక్క నిర్మాతగా బిజీగా మారాడు. కమల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్, స్వప్న దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కమలహాసన్ విలన్ గా నటిస్తుడంగా.. అమితాబచ్చన్, దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కల్కి తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి, ఈ మధ్యనే బుజ్జి అనే కారు వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ బుజ్జి కి కీర్తి సురేష్ గాత్రం ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో కల్కి ఒకటి. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమాలో కమల్ కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కల్కి రెండు పార్ట్స్ గా రిలీజ్ కానుంది. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య జరిగే సీన్స్ అన్ని సెకండ్ పార్ట్ లోనే ఉండనున్నాయి. కల్కి మొదటి పార్ట్ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే అని తెలుస్తుంది. 20 నిమిషాలు మాత్రమే ఇందులో కమల్ కనిపించనున్నాడు. అది కూడా ప్రభాస్ తో కేవలం రెండు సీన్స్ మాత్రమే ఉన్నాయి అని తెలుస్తుంది.
ఇప్పటికే కమల్ తన షూటింగ్ ను కూడా ఫినిష్ చేసేశాడు. ఇక ఈ 20 నిమిషాల కోసం కమల్ హాసన్ దాదాపు 10 కోట్లు వరకు డిమాండ్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు కోడైకొస్తున్నాయి. ఇప్పుడు కమల్ కున్న మార్కెట్ ను బట్టి మేకర్స్ కూడా అంతే ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ, 20 నిమిషాల కోసం 10 కోట్లు అంటే మామూలు విషయం కాదు అని నెటిజన్లు నోళ్లు నొక్కుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఏది ఏమైనా పారితోషకాలు ఎక్కువ ఉన్నా.. లేకపోయినా సినిమా మాత్రం హిట్ అయింది అంటే ఇవన్నీ పెద్ద లెక్కలోకి రావు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కమల్ చేతిలో ఇది కాకుండా కల్కి కాకుండా థగ్ లైఫ్ ఒకటి ఉండగా... భారతీయుడు 2 ఒకటి ఉంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలతో కమల్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











