NTR31: ఎన్టీఆర్ సినిమాలో సూపర్ స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ ప్లాన్‌కు మైండ్ బ్లాకే

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఇక, ఈ ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్‌లో స్టార్‌డమ్‌ను దక్కించుకున్నది మాత్రం జూనియర్ ఎన్టీఆరే. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ హవాను చూపిస్తున్నాడు. అన్నింటికీ మించి ఈ మధ్య కాలంలో వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు.

వరుస విజయాలతో సత్తా చాటుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అసలు ఈ కాంబోలో మూవీ ఉంటుందా? ఉండదా? అన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా రోజుల క్రితమే తన 31వ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీన్ని కొరటాల శివ మూవీ తర్వాత మొదలు పెడుతున్నట్లు కూడా వెల్లడించాడు. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ కూడా ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్'ను పూర్తి చేస్తాడని అన్నారు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు, ఖాళీ సమయంలో ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

Kamal Haasan Green Signal for Jr NTR and Prashanth Neel Movie

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంబంధించిన తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో ఓ సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా మల్టీస్టారర్‌గా రాబోతుందట. ఇందులో యంగ్ టైగర్‌తో పాటు విశ్వ నాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నారని తాజాగా తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆయనకు కథ చెప్పడంతో పాటు ఇందులో నటించేందుకు ఒప్పించాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న కారణంగానే కమల్ హాసన్‌ను సంప్రదించారని అంటున్నారు. ఇక, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లేకుంటే ఇది గాసిప్‌గానే మిగిలిపోయే అవకాశం ఉంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కూడా రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా చేయబోతున్నాడు. ఇక, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ చిత్రానికి 'మిస్సైల్', 'న్యూక్లియర్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X