భారతీయుడు 2 షూటింగ్: చివరకు అలా డిసైడ్ అయిన నిర్మాతలు
కమల్ హాసన్ తాజా సినిమా భారతీయుడు 2 సెట్స్ పై ఇటీవలే భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చిత్రయూనిట్ సభ్యులు చనిపోవడం, శంకర్ సహా 10 మందికి గాయాలవడం కారణంగా షూటింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు.
ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ కాలికి గాయాలు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు మృతి చెందిన కుటుంబాలకు కమల్ హాసన్ కోటి చొప్పున నష్టపరిహారం చెల్లిస్తానని ప్రామిస్ చేశారు. మొదటి నుంచే ఆటంకాల నడుమ నడుస్తున్న ఈ షూటింగ్ తాజా ఘటనతో ఉలిక్కిపడింది. అయినప్పటికీ పట్టు సడలని నిర్మాతలు వీలైనంత త్వరలో షూటింగ్ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో కమల్ హాసన్, కాజల్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకోవడం కారణంగా వారి వారి కాల్ షీట్స్ వేస్ట్ చేస్తే చాలా నష్టం వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా వారి కాల్ షీట్స్ వృధా చేస్తే మళ్ళీ దొరకడం కష్టం అని భావించిన నిర్మాతలు అతిత్వరలో తిరిగి సెట్స్ పైకి వచ్చేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారట. ఈ మేరకు వచ్చే నెల మొదటి వారం లోనే తిరిగి భారతీయుడు 2 షూటింగ్ ను ప్రారంభించాలని కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే దీనిపై ప్రకటన త్వరలో వచ్చే అవకాశముందని టాక్.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్, కమల్ హాసన్ లతో పాటు రకుల్ ప్రీత్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట్లో 2021 లో ఈ సినిమా విడుదల చేయాలని భావించారు కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆ సమయంకల్లా సినిమా పూర్తిచేయడం కష్టమే అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











