Project K ప్రభాస్‌కు మైండ్ బ్లాక్ చేసే విలన్.. అన్ని రోజులకు ఏకంగా 100 కోట్ల పారితోషికం!
దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు.
ఆ సినిమా నుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్, లేటెస్ట్ ఆదిపురుష్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రభాస్ క్రేజీ సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఇందులో విలన్ గా నటిస్తున్న బడా హీరో షూటింగ్ డేస్, రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

భారీ బడ్జెట్ చిత్రాలు: పెద్ద సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. సుధీర్ఘకాలంగా తెలుగులో సత్తా చాటుతున్న ప్రభాస్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ సత్తా చాటుతున్నాడు ప్రభాస్.

బ్యాన్ చేయాలని: బాహుబలి సినిమాల తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్ కు ఆశించినంతగా విజయం దక్కపోవడంతో ప్రభాస్ తర్వాత సినిమా అంటే ఆదిపురుష్ పైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించిన ఈ మూవీ తీవ్రమైన నెగెటివిటీని మూటగట్టుకుంటుంది. బ్యాన్ చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటింది.

క్రేజీ ప్రాజెక్ట్స్: ఆదిపురుష్ ఫెయిల్యూర్ తో ప్రభాస్ సినిమాలపై హోప్స్ పెంచుకున్నారు డార్లింగ్ అభిమానులు. ప్రభాస్ ఇప్పుడు ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ప్రశాంత్ నీల్ 'సలార్', నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', మారుతితో హారర్ కామెడీ చిత్రంగా 'రాజా డీలక్స్' ఉండగా.. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్టెడ్ మూవీ ఉన్నాయి.
పవర్ ఫుల్ విలన్: నిజానికి ప్రభాస్ ప్రతి సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు పక్కా హిట్ అనేంత నమ్మకాన్ని చూరగొన్నాయి. అయితే ప్రాజెక్ట్ కెపై మరింతగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం దీని నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోలు. ఇక ఇందులో ప్రభాస్ ను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ గా లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నాడని దాదాపుగా ఖరారైనట్లు న్యూస్ వస్తుంది.

దిమ్మతిరిగేలా: ప్రభాస్ కు మైండ్ బ్లాక్ చేసేలా స్కెచ్ వేసే ప్రతినాయకుడిగా కమల్ హాసన్ అలరించనున్నారట. త్వరలోనే ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ కోసం కమల్ హాసన్ ఆగస్టు నెల మొత్తం అంటే 30 రోజులు కేటాయించనున్నారని టాక్. ఈ నెల రోజుల కోసం కమల్ హాసన్ ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ వంటి నటుడికి ఆ రెమ్మునరేషన్ ఏం తక్కువ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











