twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ 'ఉత్తమ విలన్‌' ఇన్ సైడ్ టాక్?

    By Srikanya
    |

    హైదరాబాద్ :యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘ఉత్తమ విలన్'. మే 1 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఎనిమిదో శతాబ్దపు తెయ్యమ్ కళాకారుడుగా, ఇప్పటి సినీ స్టార్ గా ఇందులో కమల్ కనిపించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇన్ సైడ్ టాక్ అంటూ తమిళ సినీ వర్గాల్లో ఓ టాక్ బయిలు దేరింది. ఆ టాక్ ప్రకారం ఈ చిత్రం కమల్ గత చిత్రాల తరహాలో నవ్వులతో నిండి లేదు. అలాగే ఈ చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకూ థియోటర్ ఆర్ట్స్ మీద ఓ డాక్యుమెంటరీ లాగ సాగుతుంది. మొత్తం కథ, ప్లాట్, నేరేషన్ అన్ని ... యావరేజ్ నుంచి బిలో యావరేజ్ గా ఉన్నాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అయితే ఈ సినిమాలో ఏకైక గొప్ప అంశం...కమల్ హాసన్...అద్బుతైమ ఫెరఫార్మెన్స్. సినిమా అభిమానులకు కమల్..ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడు. అయితే కమర్షియల్ గా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది చెప్పలేము అంటున్నారు. అయితే ఈ టాక్ కరెక్టు అని చెప్పలేము. చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లోనూ అక్కడ మీడియాలోనూ చెప్పబడుతున్న ఈ సంగతి కరెక్టు కూడా కాకపోవచ్చు. కాబట్టి...హాయిగా వెళ్ళి ఉత్తమ విలన్ ని చూడటమే. ఇలాంటి ఇన్ సైడ్ టాక్ లను చదివి వదిలేయటమే మనం చెయ్యాల్సింది. కమల్ నమ్మి చేస్తున్న ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా బాగుండే అవకాసం ఉంది.

    Kamal Hasan's Uttama villain inside talk

    ఇక 'ఉత్తమ విలన్‌' చిత్రంలో హిందూ దేవుళ్లను హేళన చేస్తూ పాట చిత్రీకరించారని... దానిని తొలగించాలని విశ్వహిందూ పరిషత్తు ఆందోళనకు దిగింది. ఈ విషయమై బుధవారం ఉదయం 10 గంటలకు చేపాకంలోని అతిథిగృహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించింది. చెన్నై విభాగ నిర్వాహకులు కేఎల్‌ సత్యమూర్తి నేతృత్వం వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్రంలోని 'వెట్కం కెట్ట పండ్రి పిరవి..' అనే పాట అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. దీన్ని సినిమా నుంచి తొలగించాలని ఇప్పటికే చిత్ర యూనిట్‌ను కోరామన్నారు. వారు పట్టించుకోలేదని.. అందుకే ఆందోళనకు దిగామని చెప్పారు. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    తెలుగులో ఈ సినిమాని సి కళ్యాణ్ రిలీజ్ చేయనున్నాడు. సుమారు 8 కోట్ల రూపాయలకి సి. కళ్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ - స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బంలో మొత్తం 16 ట్రాక్స్ ఉన్నాయి.

    Kamal Hasan's Uttama villain inside talk

    యువ సంచనలనం జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఉత్తమ విలన్ ఆడియో రైట్స్ ని ఎరోస్ వారు ఫ్యాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అవే మలయాళంలో ఫేమస్ అయిన తెయ్యమ్‌ కళాకారుడిగా, మరొకటి సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ కనిపిస్తాడు.

    రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ - రాజ్ కమల్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2′ సినిమా త్వరలో విడుదల కానుంది.

    ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఇందులో ఆయన పోషించిన ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

    English summary
    Kamal Hasan's most awaited and delayed film Uttama Villain is all set for a grand release on May 1st across the world. According to the filmnagar talk Uttama Villain's inside talk is not that encouraging.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X