కమల్ నిర్మాతగా రజినీ చిత్రం.. కథను సిద్దం చేసే పనిలో టాలెంటెడ్ డైరెక్టర్

సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు ఎంత పెరుగుతుందో.. పనిలో వేగం కూడా అంతే పెరుగుతోంది. యువ హీరోలకు సైతం సాధ్యం కానీ మెరుపు వేగంతో దూసుకుపోతూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కాలా, పేట్టా, దర్బార్ ఇలా చకచకా సినిమాలు చేసేస్తూ.. ఆ వెంటనే కొత్త ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడం.. మరో నూతన సినిమా గురించి ఆలోచించేయడం.. ఇలా ఎవరికీ అందనంత వేగంగా పరిగెత్తుతున్నాడు.

దర్భార్ వసూళ్లు..

దర్భార్ వసూళ్లు..

తమిళ, తెలుగు, భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసిన దర్భార్ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. ఇక తమిళనాట కొన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్ బోర్డులతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

ప్రస్తుతం శివ..

ప్రస్తుతం శివ..

తలా అజిత్‌తో వీరం,వేదాలం, వివేకం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివ. అజిత్‌కు వరుసగా హిట్లు ఇచ్చిన శివ.. సూపర్ స్టార్ రజినీ కోసం ఓ డిఫరెంట్ స్టోరీని రెడీ చేశాడు. ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని సన్ నెట్‌వర్క్ నిర్మిస్తోంది.

ఆపై లోకేష్ కనకరాజ్

ఆపై లోకేష్ కనకరాజ్

ఖైదీ సినిమాతో దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఖైదీ సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన లోకేష్ ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్‌తో మాష్టర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అటుపై సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఓ సినిమా చేయబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నిర్మాతకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చేసింది.

Recommended Video

Cine Box : RGV Backs Off From 'Mega Family' | Latest Movie Updates | Filmibeat Telugu
కమల్ నిర్మాణంలో..

కమల్ నిర్మాణంలో..

తమిళ సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజినీ కాంత్ కలిసి ఒకే స్క్రీన్‌పై నటించి చాలా కాలమే అయింది. అయితే తాజాగా వినిపిస్తోన్న సమచారం మేరకు ఈ ఇద్దరు కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది హీరోలుగా మాత్రం కాదు. ఒకరు హీరో.. మరొకరు నిర్మాతగా మారుతున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందబోతోందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే లోకేష్ కనకరాజ్, సూపర్ స్టార్ రజినీ కాంబోలో రాబోతోన్న ఈ చిత్రాన్నే కమల్ హాసన్ నిర్మించబోతోన్నట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X