కమల్ హాసన్, త్రిషల 'మన్మధబాణం' కి హాలీవుడ్ మూలం?

By Srikanya

కమల్ హాసన్, త్రిష కాంబినేషన్ లో 'మన్మధబాణం' (తమిళంలో మన్మధన్ అంబు) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషిస్తున్నారు. మదన గోపాల్ (మాధవన్)..అంబుజం(త్రిష)తో గాఢమైన ప్రేమలో ఉంటాడు. అయితే ఆమె ఎదురుగా నిలబడి మనస్సులోని ప్రేమను ఎక్సప్రెస్ చేయటానికి భయపడుతూంటాడు. అలాగే ఓ విచిత్రమైన సంఘటనతో వీరిద్దరి మధ్య ప్రేమ కట్ అవుతుంది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల అనంతరం గోపాల్ ఈమె ఓ సినీ నటిగా ఎదిగిందని తెలుసుకుంటాడు. అస్సలు ఆమె తనతో ప్రేమలో ఉందో లేదో తెలుసుకున్న తర్వాతే ఐలవ్ యు చెప్దామని డిసైడ్ అవుతాడు.

అందుకు ఓ డిటెక్టివ్ సహాయం తీసుకోమని అతని స్నేహుతుడు రమేష్ అరవింద్ సలహా ఇస్తాడు. అప్పుడు వారు ఆర్మీ మాజీ మేజర్ ఆర్.మన్నార్ (కమల్ హాసన్) ని కలుస్తారు. ఆయన ఇప్పుడు ఓ ప్రెవేట్ డిటెక్టివ్ గా పనిచేస్తూంటాడు. అక్కడ నుంచి కమల్ హాసన్..త్రిషను షూటింగ్ లలో ఫాలో చేస్తూ స్నేహం చేస్తాడు. ఆ డిటెక్షన్ విషయం కమల్ హాసన్ ప్రేయసి దీప(సంగీత) కి తెలియక అపార్దాలు చోటు చేసుకుంటాయి. అందులోనూ ఆమె అంబుజానికి స్నేహితురాలు కూడా. ఈ చిక్కు ముడులన్నిటినీ మాధవన్ ఎలా విడతీసి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది కామిడీ ఆఫ్ ఎర్రర్ ఫార్మెట్ లో సాగుతుంది. ఇక తమిళ హీరో సూర్య ఈ చిత్రంలో త్రిష సరసన ఓ పాటలో కనపడతాడు. అలాగే త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఈ చిత్రంలో కీరోల్ చేస్తోంది. కమల్ హాసన్, ఆయన ఫేవరెట్ రైటర్ క్రేజీ మోహన్ కలిసి ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి ప్రేరణ..1998లో వచ్చిన అమెరికన్ కామిడీ చిత్రం "దేర్ ఈజ్ సమ్ ధింగ్ ఎబౌవట్ మేరీ" అనే చిత్రం అని వినపడుతోంది. ఫెరల్లీ బ్రదర్శ్ రూపొందించిన ఈ చిత్రంలో బెన్ స్టెల్లర్ పాత్రను మాధవన్ చేస్తూంటే..కేమరాన్ డియాజ్ పోషించిన మేరీ పాత్రను త్రిష చేస్తోంది. అయితే దేర్ ఈజ్ సమ్ ధింగ్ ఎబౌవట్ మేరీలో పాత్ర డాక్టర్ గా మారుతుంది. ఇక్కడ త్రిష నటిగా కన్పింస్తుంది. మ్యాట్ దిల్లాన్ పోషించిన ప్రెవేట్ డిటెక్టివ్ పాత్రను కమల్ చేస్తున్నారు. అయితే కేవలం ప్లాట్ ని మాత్రమే తీసుకుని ఇండియన్ నేటివిటికి అనుగుణంగా కథను మార్చి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక దేర్ ఈజ్ సమ్ ధింగ్ ఎబౌవట్ మేరీ చిత్రం ఆధారంగా హిందీలో ఇప్పటికే "దీవానా హుహే పాగల్" (2005) లో ప్రీమేక్ చేసారు. అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి, షాహిద్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. అయితే కమల్ హాసన్, దర్శకుడు కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన దశావతారం, తెనాలి, పంచతంత్ర వంటి చిత్రాలు హిట్ అయ్యాయి కాబట్టి ఈ చిత్రం మంచి నవ్వులే పంచుతుందని ఆశించవచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడు. రచన: వెన్నెలకంటి, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X