నిజమా....కమల్ మారిపోయాడా?

By Srikanya

చెన్నై : విశ్వనటుడు కమల్‌హాసన్‌ నమ్మకాలు,దేముడు, దెయ్యం, సంప్రదాయాలు వంటి వాటికి దూరంగా ఉంటూంటారు. అయితే వయస్సు ఎఫెక్టో లేక మరొకటో ఆయన మెల్లిగా భక్తుడుగా మారుతున్నాడంటున్నారు తమిళ సినిమా వర్గాలు. ఆయన తన తాజా చిత్రం 'పాపనాశం'(దృశ్యం రీమేక్) లో భాగంగా తిరునవెల్లి, వెళ్ళారు. అక్కడ నుంచి మరికొన్ని పవిత్ర ప్రదేశాలు తిరగటం.. అక్కడ స్వామీజీలను, సాధువులను కలవటం జరుగుతోందని సమాచారం. అంతేకాక రీసెంట్ గా జియర్ స్వామిని కలిసారని, ఆయన పలు ఆధ్యాత్మిక విషయాలు చర్చించారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆయన వద్ద చొక్కా విప్పి... నమస్కరించాడంటున్నారు. అయితే ఈ విషయమై కమల్ తరుపున నుంచి ఖండన ఏమీ రాలేదు.

ఇక ఈ చిత్రం విషయానికి వస్తే.... ఇందులో కమల్‌ భార్యగా గౌతమి నటిస్తున్నారు. మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన 'దృశ్యం' చిత్రానికి రీమేక్‌ ఇది. తెలుగులోనూ వెంకటేశ్‌ హీరోగా ఈ సినిమా పునర్నిర్మితమై ప్రేక్షకులను అలరించింది. అదే కథతో ఇప్పుడు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కమల్‌ 'పాపనాశం'గా సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర వాల్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి.

Kamal turns devotee during shooting

కమల్‌ మళ్లీ 1980 దశకంలో ఉన్నట్లు ఇందులో కనిపిస్తున్నారు. ఓ గ్రామీణ వ్యక్తిలా.. సినీ జనాలను ఆకట్టుకుంటున్నారు. 'మైఖెల్‌ మదన కామరాజ్‌' శైలిలో కమల్‌ కనిపిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి కథాపరంగా 'పాపనాశం' ఎంత ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే అంటున్నారు. బిజినెస్ వర్గాల్లో సైతం ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అన్ని చోట్లా ప్రూవైన కథ కావటంతో సినిమా ఘన విజయం సాధించటం ఖాయమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X