కమలినీ ని బాగా వాడుకుని వదిలేసింది ఎవరూ??

By Sindhu

శేఖర్ కమ్ముల సెంటిమెంట్ గా కలసొచ్చే కమలినీ ముఖర్జిని ఆమధ్య తను చేసిన 'ఆవకాయ బిర్యాని" లో అవకాశం ఇవ్వకపోయే సరికి అది కాస్త ఢాం అనడంతో తాజాగా విడుదలైన చిత్రం లీడర్ లో ఓ ప్రత్యేక పాత్రని పోషిందన్నది గాసిప్పే అని ఆ విషయం సినిమా విడుదలలైన తర్వాత కానీ తెలియలేదు ప్రేక్షకులకు.

మంచి కాఫీలాంటి 'ఆనంద్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం 'లీడర్" సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 'ఆనంద్" సినిమా ద్వారా కమలినీ ముఖర్జీని హీరోయిన్ గా పరిచయం చేసాడు. ఈ ఇద్దరూ బాగా ప్రెండ్లీగా ఉండేవారట. ఆ తర్వాత 'గోదావరి" చిత్రంలో కూడా చేసింది. కమలినీతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే శేఖర్ ఈ మద్య ఆమె ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడంలేదట. ఈ విషయం చెప్పి కమలినీ ఆమె సన్నిహితుల దగ్గర చాలా బాధపడుతోందని సమాచారం.

చిత్ర పరిశ్రమలో అవసరం ఉన్నంతవరకూ అందరూ ప్రెండ్లీగానే ఉంటారని, అవసరం లేకపోతే కర్వేపాకులా తీసిపారేస్తారన్న విషయం కమలినీకి తెలియదేమో. ఇప్పుడు శేఖర్ కమ్ముల రీచాతో క్లోజ్ గా ఉంటున్నాడట. ఏదేమైనా మరీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోలేనంత బిజీగా శేఖర్ ఉండడు కాబట్టి ఒక్కసారి కమిలినీతో మాట్లాడితే బాగుంటుందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X