కామ్నా కోరిక తీరుతుందా?

By Staff

Kamna Jetmalani
మహిళా దర్శకురాలు బి.జయ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమికులు' చిత్రంతో పరిచయమైన కామ్నా జఠ్మలానీ...శ్రీదేవి పోలికులుండే అందమైన అమ్మాయి గా పరిశ్రమ దృష్టిలో పడింది. తర్వాత కొరియాగ్రాఫర్ అమ్మ రాజ్ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రణం' చిత్రంతో యే మొహమాటాలు లేకుండ అందాలు ఆరబరుస్తుందనే ఇమేజ్ తెచ్చుకుంది. తర్వాత 'సామాన్యుడు' లో జగపతి బాబు ప్రక్కన చేసినా పెద్దగా పేరు రాలేదు. మహేష్ బాబు 'సైనికుడు'లో ఐటమ్ సాంగ్ చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఆమె డైలమాలో పడింది. అందరిలానే ఆమెచూపు ఇప్పుడు తమిళ పరిశ్రమపై పడింది.

అంతకు ముందు అక్కడు జయం రవితో Idhaya Thirudan సినిమాలో చేసింది. రావల్సినపేరు రాలేదు.ఇప్పుడు జీవా ప్రక్కన Machakaaran సినిమా చేసింది. అదీ పెద్ద ప్రాధాన్యత లేని పాత్రేనని దాని మూలంగా తన కెరీర్ కి పెద్దగా ఉపయోగం లేదని అర్ధం చేసుకుంది.దాంతో తెలుగులో యెలానూ ఆఫర్స్ రావటం లేదు. కాస్త కాన్సరటేషన్ పేడితే అక్కడైనా కాస్త మంచి ఆఫర్లు సంపాదించవచ్చని తలపోస్తోంది. అందుకోసం ఆమె పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలని ప్రిపేరవుతోంది.

దానిలో భాగంగా హాట్ హాట్ గా స్టిల్స్ తీయంచుకుని దర్శక,నిర్మాతలకు పంపుతోందిట. దాంతో ఆమె తమిళ కోరిక తీరుతుందా లేక తెలుగు లాగే వెనక్కివస్తుందా అని పరిశ్రమలో పనిలేనివాళ్ళకు హాట్ టాపిక్ అయ్యింది. అయినా హాట్ గా ఉండే వాళ్ళ గురించేగా హాట్ టాపిక్స్ చెప్పుకునేది. కామ్నా కోరిక కూడా అదే కదా...బెస్టాఫ్ లక్ కామ్నా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X