Kamna Jethmalani: కామెడీ హీరో తమ్ముడితో గోపిచంద్ హీరోయిన్ లవ్ ఎఫైర్.. కానీ

గోపిచంద్ నటించి హిట్ కొట్టిన రణం సినిమా హీరోయిన్ కామ్న జెఠ్మలానీ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ పెద్ద సినిమాలను మిస్ చేసుకుందట. పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇంకా సినిమాల్లో నటించాలని కోరిక ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే తన కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ హీరో తమ్ముడు ప్రేమ పేరుతో మోసం చేసినట్లు వార్తలు వినిపించాయి.

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో..

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో..

గోపిచంద్ సరసన రణం వంటి మంచి విజయం సాధించిన సినిమాతో పాపులర్ అయింది కామ్న జెఠ్మలానీ. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కామ్న జెఠ్మలానీ తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

బిజీగా ఉన్న సమయంలోనే..

బిజీగా ఉన్న సమయంలోనే..

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఎన్నో పెద్ద సినిమాలను మిస్ చేసుకుందట ఈ అమ్మడు. తనది సింధీ ఫ్యామిలీ అని, ఆమె కుటుంబంలో 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది కామ్న జెఠ్మలానీ. అయితే ఆమెకు వాళ్ల అమ్మ ఫుల్ సపోర్ట్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది.

హ్యాండ్ ఇచ్చిన హీరో తమ్ముడు..

హ్యాండ్ ఇచ్చిన హీరో తమ్ముడు..

ఇదిలా ఉంటే కామ్మ జెఠ్మలానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఓ కామెడీ హీరో తమ్ముడితో ప్రేమయాణం కొనసాగించదని అప్పట్లో వార్తలు వచ్చాయి. కొంతకాలం సాఫీగా సాగిన వీరి ప్రేమ కథ ఆ తర్వాత బెడిసి కొట్టిందట. కొత్త అమ్మాయిలకు ఆ హీరో తమ్ముడు ఆకర్షితుడై కామ్న జెఠ్మలానీకి హ్యాండ్ ఇచ్చాడట.

ప్రారంభంలో రూ. 300 జీతం..

ప్రారంభంలో రూ. 300 జీతం..

దీంతో మోసం పోయానని గ్రహించిన కామ్న జెఠ్మలానీ సినీ ఇండస్ట్రీకే దూరమై వెళ్లిపోయిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిలో ఎంత నిజం ఉందనేది మాత్రం ఇప్పటికీ తెలియదు. కాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కామ్న జెఠ్మలానీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. మోడలింగ్, డ్యాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన కామ్న జెఠ్మలానీ మొదటి జీతం రూ. 300 అని తెలిపింది.

ఆ సమయంలో మూడు చిత్రాలు..

ఆ సమయంలో మూడు చిత్రాలు..

ఇలా తాను పడిన కష్టం గురించి పెళ్లికి ముందే కాబోయే వాడికి చెప్పిందట. ఎంగేజ్ మెంట్ సమయంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నాని.. కన్నడ, తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని పేర్కొంది. అయితే సినిమా అంటే విపరీతమైన పిచ్చి అని, ఇండస్ట్రీలో పని చేయడం ఎంత ఫ్యాషనో అన్నీ కూడా తన భర్త సూరజ్ కు ముందే చెప్పానని కామ్న జెఠ్మలానీ ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.

పూరి జగన్నాథ్ సినిమాలో..

పూరి జగన్నాథ్ సినిమాలో..

తను నటిస్తే తన భర్త సూరజ్ యాక్సెప్ట్ చేస్తాడని, అంతేకాకుండా ఎంతో సపోర్టింగ్ గా కూడా ఉంటాడని కామ్న జెఠ్మలానీ చెప్పింది. అయితే ఆ ఇంటర్వ్యూలో సమయంలో తనకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని ఉందని, దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలని తన మనసులోని మాట బయట పెట్టింది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్.

సోలోగా స్పెషల్ సాంగ్..

సోలోగా స్పెషల్ సాంగ్..

అంతేకాకుండా ఓ స్పెషల్ సాంగ్ చేయాలనే డ్రీమ్ కూడా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇదివరకు మహేశ్ బాబు సైనికుడు మూవీలో ఓరుగల్లుకే పిల్లా అనే సాంగ్ లో అందరు ఉంటారని, సోలోగా స్పెషల్ సాంగ్ చేయాలని ఉందని కామ్న జెఠ్మలానీ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X