రష్మిక ఔట్.. నయనతార ఇన్! లారెన్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
దక్షిణాది సినీ ప్రేక్షకులకు హారర్-కామెడీ అంటే ముందుగా గుర్తుకు వచ్చే ఫ్రాంచైజీ 'కాంచన'. దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ సృష్టించిన ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగులోనూ భారీ రెస్పాన్స్ అందుకుంది. అదేవిధంగా బాక్సాఫీస్ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఫ్రాంచైజీకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇప్పుడు ఈ సిరీస్‌లో చివరి భాగంగా భావిస్తున్న'కాంచన 4'పై అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కాస్టింగ్ పై మరోసారి భారీ చర్చ మొదలైంది.
గతంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ముని, కాంచన, గంగ, కాంచన 3 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో చివరి భాగంగా రూపొందుతున్న కాంచన 4 ను మరింత గ్రాండ్‌గా, గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాలని లారెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే.. కామెడీ ట్రాక్ కోసం కోవై సరళ, రెడిన్ కింగ్స్లీ, దేవదర్శిని వంటి నటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.

అయితే.. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పాత్రకు రష్మికను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కథలో ఈ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా సినిమా కథను ముందుకు నడిపించే కీలక మలుపులు, ఈ ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్‌లోనే ఉండబోతున్నాయని సమాచారం. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ కు స్క్రీన్ ప్రెజెన్స్, స్టార్ వాల్యూ కలిగిన నటి అవసరమని లారెన్స్ టీమ్ భావించనట్టు తెలుస్తోంది. దీంతో రష్మిక మందన్నాను కాదని లేడీ సూపర్ స్టార్ నయనతార వైపు మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది.
నయనతార ఇప్పటికే 'మూక్కుత్తి అమ్మన్','అరమ్','మాయా'వంటి చిత్రాల్లో స్ట్రాంగ్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హారర్, ఫాంటసీ, ఎమోషనల్ డ్రామా జానర్లలో నటించిన నయనతారను తీసుకోవడం వల్ల కాంచన 4 కు అదనపు బలం చేకూర్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా నయనతార ఎంట్రీతో ఈ సినిమాకు తమిళం, తెలుగు, హిందీ మార్కెట్లలో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. భారీ విజువల్స్, హై-ఎండ్ టెక్నికల్ వర్క్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే నయనతార ఎంట్రీపై మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ రష్మిక స్థానంలో నయన్ నటించబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే 'కాంచన 4' హైప్ మరో స్థాయికి చేరుకోవడం ఖాయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా ఈ హైప్ క్రియేట్ చేస్తే.. రేపు విడుదలైన తరువాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications




