లారెన్స్, అక్షయ్, సంజయ్...బాలీవుడ్ ‘కాంచన’
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన" భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ద్వారా రాఘవ లారెన్స్ బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారని సమచారం. బాలీవుడ్ కాంచనలో అక్షయ్ కుమార్ హీరోగా, హిజ్రా కాంచన పాత్రను సంజయ్ దత్ చేయడానికి అంగీకరించాడని సమాచారం.
ముని చిత్రానికి స్వీక్వెల్ గా వచ్చిన కాంచన సినిమాను తెలుగులో బెల్లంకొండ సురేష్ నిర్మించగా లారెన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా లారెన్స్, హిజ్రా కాంచన పాత్రలో తమిళ నటుడు శరత్ కుమార్ కనిపించారు. హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడంతో....ఇదే సినిమాను బాలీవుడ్ లోనూ రీమేక్ చేసి సొమ్ము చేసుకోవడాకిని ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఈ సినిమాపై తొలుత కండల వీరు సల్మాన్ ఖాన్ కన్నేసినట్లు వార్తలు వచ్చినా.....చివరకు ఇటు వైపు మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











