‘కందిరీగ-2’ కథ కంచికేనా..?
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కందిరీగ-2' చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు కూడా. తాజా పరిస్థితుల నేపథ్యంలో 'కందిరీగ-2' కథ కంచికే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌పై బెల్లంకొండ సురేష్ చెయ్య చేసుకోవటమే ఇందుకు కారణం. ఈ మేరకు దర్శకుడు ఎపీ ఫిల్మ్ డైరక్టర్స్ అసోషియేషన్ లో కంప్లైంట్ చేసారు. బెల్లంకొండ సురేష్‌కి, సంతోష్ శ్రీనివాస్ కి మధ్య వివాదం రెమ్యునేషన్ విషయంలో తలెత్తిందని, రెమ్యునేషన్ విషయంలో మాట మాట రావటంతో కోపగించిన బెల్లంకొండ సురేష్ ..వెంటనే ఆవేశంలో శ్రీనివాస్ ని కొట్టాడని తెలుస్తోంది.
కందిరీగ-2 చిత్రానికి సంబంధించి కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. నటించడానికి హీరో రామ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ తరుణంలో ఈ వివాదం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, బెల్లకొండ కలిసి పనిచేసే పరిస్థితి లేదని కొందరంటున్నారు.
అయితే పరిశ్రమలో ఇలాంటి వివాదాలు సర్వసాధారణమే అని...త్వరలోనే సమసి పోతాయని బెల్లకొండ సన్నిహితులు అంటున్నారు. గతంలో బెల్లంకొండ చాలా మంది హీరోలు, దర్శకులు, హీరోయిన్లతో గొడవలు పడ్డారని, ఆవేశంలో అలా చేయడం, మళ్లీ రాజీకి రావడం ఆయనకు అలవాటే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











