హిట్టుతో కళ్లు నెత్తికెక్కిన తెలుగు హీరో
కందిరీగ సినిమా విజయం హీరో రామ్ బిహేవియర్ ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకుంటున్నారు. అందులోనూ తనకు లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ పై ఫిల్మ్ ఒఛాంబర్ లో కేసు వెయ్యడం,గౌతమ్ మీనన్ ప్రాజెక్టులోంచి బయిటకు రావటం అందరిలో నెగిటివ్ ఇంప్రెషన్ కలగచేస్తోంది. మరో ప్రక్క రైటర్స్ సైతం అతనంటే భయపడుతున్నారని చెప్పుకుంటున్నారు. రామ్ తన డైలాగులు తానే చెప్తున్నాడని, తనును ఎలా ప్రాజెక్టు చేయాలో సీన్స్ కూడా చెప్తూ ఇబ్బంది పెడుతున్నాడని వినిపిస్తోంది. అంతేగాక అతని పెదనాన్న అయి న స్రవంతి రవికిషోర్ సైతం అతన్ని ప్రక్కన పెట్టి ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడని వినపడుతోంది. ఈ నేపధ్యంలో దర్శకులు అంత గొప్ప డైరక్టర్ గౌతమ్ మీనన్ షూటింగ్ లోంచే బయిటకు వచ్చేసాడు..మన మాట ఎక్కడ వింటాడనే ఆలోచనలో పడుతున్నారుట. గౌతమ్ మీనన్ సినిమా నుంచి హీరో రామ్ బయిటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి కారణం ఇగో దెబ్బతినటమేనంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో రామ్ క్లారిఫికేషన్ ఇచ్చారు. రామ్ మాటల్లోనే...నేను మొదట గౌతమ్ మీనన్ సినిమాలో హీరో అయినందుకు చాలా ఆనందపడ్డాను. నాతో మొదట మీటింగ్ కాగానే నాతో సినిమా చేస్తానని ఆయన ప్రకటించటంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. నా దగ్గర ఒక సినిమా చేయటానికి డేట్స్ ఉన్నాయి.అయితే ఆయన బై లింగ్వుల్ అన్నారు. అయితే చివరి నిముషంలో ట్రైలింగ్వల్ సినిమా అని తేల్చారు. దాంతో నాకు ఎందుకంటే ప్రేమంటా సినిమాకు డేట్స్ క్లాష్ వస్తున్నాయి. దాంతో నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను.ఇప్పుడు నా శక్తి ,ఎనర్జి మొత్తం ఎందుకంటే ప్రేమంటా చిత్రానికే. మరో సారి చెప్తున్నాను...మా మధ్య ఇగో క్లాషెష్ లేవు..నో డ్రామా...నో మశాలా...కేవలం డేట్స్ ఇష్యూలు మాత్రమే అన్నారు.


Click it and Unblock the Notifications











