రక్త చరిత్రలో పరిటాల సునీతగా చేసేదెవరు?
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రంలో పరిటాల సునీతగా ఎవరు చేస్తారనే విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏక్ నిరంజన్ లో చేసిన కంగనా రౌనత్ ఆ పాత్ర చేయవచ్చునని కొందరంటున్నారు. ఆమె ఇంతకు ముందు చేసిన గ్యాంగస్టర్ చిత్రం ప్రత్యేకంగా తెప్పించుకుని వర్మ మరోసారి చూసారని అందుకే ఆమెను తీసుకునే అవకాశముందని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. అలాగే మద్దెల చెరువు సూరి భార్య బానుమతి పాత్రలో కూడా ఓ పాపులర్ హీరోయిన్ ని సంప్రదించారని సమాచారం. అయితే లెంగ్త్ తక్కువ ఉండటం, పెద్దగా ప్రాధాన్యత లేకపోవటంతో ఆమె ఇంకా ఓకే చెప్పలేదంటున్నారు. దాంతో వర్మ తన క్యాంపులో పరిచయం చేసిన హీరోయిన్స్ ని పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. ఇక బయిట ఈ స్త్రీ పాత్రలపై చర్చ జరుగుతున్నా వర్మ మాత్రం ఎక్కడా పెదవి విప్పి కన్ఫర్మ్ చేయటం లేదు. ఇక ఇప్పటికే పరిటాల రవిగా వివేక్ ఒబరాయ్ ని ఎంపిక చేయటం అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.


Click it and Unblock the Notifications











