డోస్ పెంచమంటున్న కంగన.. మరో వివాదం కానుందా?

వెండితెరపై బయోపిక్స్ హంగామా బాగా నడుస్తోంది. గొప్ప గొప్ప నాయకుల జీవిత కథలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు ప్రేక్షకుల నుంచి బయోపిక్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మహానటి సావిత్రి జీవితకథ కు నీరాజనం పట్టారు తెలుగు ప్రేక్షుకులు. ఈ సినిమా విజయం మరిన్ని బయోపిక్స్ తెరకెక్కడానికి పునాదిగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జయలలిత జీవిత కథ ఆధారంగా ఒక్కటి కాదు.. చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఓ బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తుండగా.. ఇంకోదాంట్లో సీనియర్ నటి రమ్యకృష్ణ, మరోదాంట్లో బాలీవుడ్ కంగనా రనౌత్ జయలలితగా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో అమ్మ జయలలిత జీవితాన్ని వెండితెరపై చూడాలని ప్రేక్షకుల్లో ఆతృత మొదలైంది.

Kangana Ranaut Jayalalitha biopic update

కాగా జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూడు బయోపిక్స్ లో కంగనా చేస్తున్న బయోపిక్ పైనే అందరి కళ్లున్నాయనేది తాజా సమాచారం. కంగనా అంటేనే వివాదాలకు పెట్టింది పేరు.. అలాంటి హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండనుందా అనేది ప్రేక్షకలోకంలో కుతూహలం. మరోవైపు ఈ సినిమాకు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్పెషల్ అట్రాక్షన్. ఈ చిత్రంలో రక్తికట్టించే హైలైట్ సన్నివేశాలుండేలా తన పదునైన కలంతో విజయేంద్ర ప్రసాద్ కథను రూపుదిద్దుతున్నాడట.

Kangana Ranaut Jayalalitha biopic update

కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్. విజయ్ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సినిమాలో ఇతర రాజకీయ నాయకులకు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యధావిధిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను సైతం స్క్రీన్ ప్లేలో యాడ్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే సీన్స్ విషయంలో ఎంత డోస్ పెంచితే అంత బాగుటుంటుందని కంగానా పేర్కొందని సమాచారం. ఇటీవలే మణికర్ణిక రూపంలో వెండితెరపై రాజ్యమేలిన ఈమె.. జయలలిత బయోపిక్ ని ఎలా హాండిల్ చేయనుందనే కోణంలో చర్చించుకుంటున్నాయి సినీ వర్గాలు. మరోవైపు కంగనా రనౌత్ నటిస్తోంది కాబట్టి జయలలిత బయోపిక్ పై ఎలాంటి వివాదాలు చుట్టుముడతాయో అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X