కంగనా కోసం కంగారు
తెలుగు ఫీల్డులో కంగనా రౌనత్ హాట్ ప్రాపర్టీ అయిపోయింది. ప్రతీరోజు ఆమెకు ఫోన్ కాల్స్, విజిటర్స్ తో ఎడతెరపి లేకుండా ఉంటోంది. ఏక్ నిరంజన్ రిలీజ్ అవగానే ఆమె స్టార్ అవుతుందనీ అప్పుడు డేట్స్ కావాలంటే కష్టమవుతుందని ఇప్పుడే వెంటబడుతునన్నారు. ఇక ఆమె కూడా బాలీవుడ్ లో పెద్ద డిమాండ్ ఎలాగో లేదు ఉన్నచోటే రూపాయి సంపాదించుకోవటం మేలు అన్నట్లు బిహేవ్ చేస్తోంది. వచ్చిన దర్శక,నిర్మాతలతో చాలా కలపుకోలుదనంతో ఆకట్టుకుంటోందని వినికిడి. దాంతో సినిమా సంగతి దేముడెరుగు ఒక్కసారి చూసి వద్దాం అనే బ్యాచ్ పెరిగిపోయింది. మరో ప్రక్క ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఫలానా ఫోజు కావాలి మిస్ అనగానే ఓకే అని రంగంలోకి దూకి వారు సాటిస్ ఫై అయ్యేదాకా ఫోజ్ లిస్తోందిట. దాంతో వారు కూడా కంగనా అంటే రెడీ అంటూ పరుగెడుతున్నారు. ఇక హీరోలైతే తమ ప్రక్కన ఆమె ఎలా ఉంటుందో చూడమని సజెషన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఇంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఇలియానా తర్వాత ఈమే అంటున్నారు. మరి పూరి డిస్కవరీ అంటే మాటలా...


Click it and Unblock the Notifications











