నగ్నంగా నటించడానికి కంగన రనౌత్ రెడీ.. సెన్సేషనల్ మూవీ రీమేక్‌‌లో బాలీవుడ్ క్వీన్!

బాలీవుడ్ అందాల తార కంగన రనౌత్ విలక్షణమైన, విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు. ప్రతీ చిత్రం డిఫరెంట్‌గా ఉండేలా చర్యలు తీసుకొంటుంది. మణికర్ణిక అందించిన విజయం జోష్‌తో కంగన రనౌత్ తెర మీద ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఓ పక్క జయలలిత బయోపిక్‌లో నటిస్తూనే మరో సెన్సేషనల్ మూవీకి రెడీ అవుతున్నది. తమిళ రీమేక్ చిత్రంలో నటించేందకు పచ్చ జెండా ఊపిందనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తమిళ అడై రీమేక్‌లో

తమిళ అడై రీమేక్‌లో

తమిళంలో ఘన విజయం సాధించిన అడై (తెలుగులో ఆమె) చిత్రం నటి అమలాపాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తారు. కంగన రనౌత్ నటనపై ఓ రేంజ్‌లో ప్రశంసించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా కాసుల పంటను పండించలేకపోయింది. కథ, కథనాల్లో లోపాలే అందుకు కారణమని ఓ వర్గం అభిప్రాయపడింది.

ముఖేష్ భట్ నిర్మాతగా

ముఖేష్ భట్ నిర్మాతగా

అలాంటి అడై సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌గా మలుస్తున్నారనే విషయం తమిళనాడులో వైరల్ అయింది. ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ రీమేక్ హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. అంతేకాకుండా భారీ లెవెల్లో హిందీ సినిమాగా మలిచే ప్లాన్స్ మొదలయ్యాయని వార్త బాలీవుడ్‌లో కూడా సంచలనం రేపింది. ఈ సినిమాకు రథ్ కుమార్‌ను దర్శకుడిగా రంగంలోకి దించే అవకాశాలున్నాయి అని బాలీవుడ్ పత్రిక వెల్లడించింది.

 హిందీ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్

హిందీ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్

తమిళంలో అమలాపాల్ పోషించిన పాత్రను కంగన రనౌత్‌తో చేయాలని నిర్మాత ముఖేష్ భట్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అయితే ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని, ఒకవేళ అన్ని కుదిరితే కంగన రనౌత్ ఆమెగా హిందీలో కనిపించబోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంచలనం రేపిన అమలాపాల్ రోల్

సంచలనం రేపిన అమలాపాల్ రోల్

అడై చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించిన సీన్‌ సినిమాకు అత్యంత క్రేజ్‌గా మారిన విషయం తెలిసిందే. అలాంటి పాత్రను కంగన రనౌత్ చేస్తే ఆ సీన్‌లో ఆమె నటిస్తుందా? లేక కథాపరంగా ఏమైనా మార్పులు చేస్తారా అనే విషయం గురించి కొన్ని రోజులు ఆగాల్సిందే. అమలా పాల్ చేసిన పాత్ర కంగనను కూడా ఆకట్టుకొన్నట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

కంగన రనౌత్ కెరీర్

కంగన రనౌత్ కెరీర్

ఇక కంగన రనౌత్ విషయానికి వస్తే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జే జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ తలైవి చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. ఇంకా హిందీలో పంగా అనే సినిమాలో విలక్షణమైన పాత్రను పోషిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X