'రోబో' చిత్రాన్ని అమ్ముకోలేక కన్నారావు కష్టాలు?
రజనీ రోబో చిత్రాన్ని పోటీపడి మరీ 27 కోట్లకు కొనుగోలు చేసిన కన్నారావు..డిస్ట్రిబ్యూటర్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక రోబో ఫిల్మ్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకునే వారు...శ్రీ కృష్ణ ట్రేడర్స్..ఓనర్ తోట కన్నారావు..ఆనంద్ రీజన్సీ, రూమ్ నెంబర్ 221, రాజమండ్రి అంటూ టీవీ ఛానెల్స్ లోనూ, సాక్షి పేపర్లులోనూ ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ యాడ్ ఇస్తున్నారు. ఫిలిం రంగంలో అనుభవం లేకపోవటం కన్నారావుకి సమస్యగా నిలిస్తే..ఇరవై ఏడు కోట్లు కొన్నారు..ఎంత రేటు చెప్తారో అని డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రావటం లేదని వినికిడి. మరో ప్రక్క చిత్రం రిలీజ్ తేది అక్టోబర్ ఒకటి అని ప్రకిటించేసారు. టైమ్ దగ్గరపడుతోంది. పరిస్ధితి చూస్తుంటే కన్నారావు స్వయంగా విడుదల చేసుకోవాలేమో అంటున్నారు. మరో ప్రక్క ఇరవై ఏడు కోట్లు రికవరీ అంటే మామూలు మాటలు కాదని సీనియర్స్ చర్చిస్తున్నారు. అయితే రజనీకాంత్ హవా సామాన్యమైంది కాదు కాబట్టి..సమస్య ఉండకపోవచ్చు. కళానిధి మారన్ తమిళంలో నిర్మిచిన ఈ చిత్రం బడ్టెట్.. రూ.180 కోట్లు. ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింన ఈ చిత్రం తమిళ్, హిందీల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 1న 2,250 ప్రింట్లతో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











