రామ్ చరణ్-బోయపాటి సినిమాలో ‘ఈగ’ విలన్?
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' సినిమాలో విలన్ పాత్ర పోషించి తెలుగునాట పాపులర్ అయిన కన్నడ నటుడు సుదీప్, ఆ తర్వాత 'బాహుబలి-1' సినిమాలోనూ ఓ చిన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కిచ్చా యాక్టర్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తర్వాతి సినిమాలో సుదీప్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుదీప్ పాత్ర చాలా పవర్‌ఫుల్ ఉండబోతోందనే వార్తలు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తున్నాయి.

మరో వైపు సుదీప్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో ఓ పాత్రకు ఎంపికయ్యారు. అయితే ఇపుడు రామ్ చరణ్ మూవీలో కూడా సుదీప్ నటించబోతున్నట్లు వార్తలు రావడం మెగా అభిమానులను మరింత ఎగ్జైట్మెంటుకు గురి చేస్తోంది.
కన్నడ సినీ పరిశ్రమలో సుదీప్ స్టార్ హీరో. అక్కడ ఆయన సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. కన్నడ మార్కెట్‌ను గ్రాబ్ చేసేందుకే సుదీప్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











