‘ఆచార్య’లో ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు: చిరు, చరణ్‌తో పాటు ఆ స్టార్ కూడా.. దీని వెనుక ప్లాన్ అదే!

రీఎంట్రీలో సూపర్ స్పీడుతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరిసింహారెడ్డి' వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తూ సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ ఇద్దరితో పాటు మరో స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా మూడో హీరో? వివరాల్లోకి వెళితే....

ఆయన కోసం ‘ఆచార్య'గా మారిన చిరు

ఆయన కోసం ‘ఆచార్య'గా మారిన చిరు

మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి.

మూవీని మెగా మల్టీస్టారర్‌గా చేసేశారుగా

మూవీని మెగా మల్టీస్టారర్‌గా చేసేశారుగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ ఉండే ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఓ మిషన్ కోసం అతడు ప్రాణాలు కోల్పోతే.. చిరంజీవి దాన్ని కంప్లీట్ చేస్తాడని.. ఇదే సినిమా కథ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ్‌కు హీరోయిన్ కూడా ఉందట.

ఇది కూడా అదే తరహాలో... రిలీజ్ డేట్

ఇది కూడా అదే తరహాలో... రిలీజ్ డేట్

తన గత చిత్రాల మాదిరిగానే 'ఆచార్య'ను కూడా సందేశాత్మకంగా రూపొందిస్తున్నాడట డైరెక్టర్ కొరటాల శివ. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలాఉండగా, ఈ సినిమాను మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.

అంచనాలు పెంచేస్తూ.. రికార్డులు బద్దలు

అంచనాలు పెంచేస్తూ.. రికార్డులు బద్దలు

మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'ఆచార్య' మూవీ టీజర్ ఇటీవలే విడుదలైంది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఇందులో యాక్షన్ సీన్స్‌ను చూపించారు. ఇందులో చిరంజీవి లుక్.. స్టైల్స్ అదరగొట్టేశాయి. అద్భుతమైన విజువల్స్‌కు మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్నిచ్చింది. దీంతో ఈ టీజర్‌కు భారీ స్థాయిలో వ్యూస్‌, లైక్స్ వచ్చి పలు రికార్డులు బద్దలయ్యాయి.

‘ఆచార్య'లో ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు

‘ఆచార్య'లో ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు

టాలీవుడ్‌లోనే ఉన్నత విలువలతో రూపొందుతోన్న 'ఆచార్య' బిజినెస్ కూడా భారీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల హక్కులు అత్యధిక ధరకు అమ్ముడు పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఇందులో నటించేది ఇద్దరు కాదు.. ముగ్గురు అని సమాచారం.

Recommended Video

Acharya Movie : Megastar Chiranjeevi క్రేజ్ కి సరిలేరు ఇంకెవ్వరూ.. Nizam King చిరు !
చిరు, చరణ్‌తో పాటు ఆ స్టార్ కూడా ఎంట్రీ

చిరు, చరణ్‌తో పాటు ఆ స్టార్ కూడా ఎంట్రీ

తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య'లో మరో కీలక పాత్ర కూడా ఉందట. దీనికి కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పది నిమిషాల పాటు ఉండే ఈ రోల్ కోసం అతడు త్వరలోనే హైదరాబాద్ వచ్చి.. షూటింగ్‌లో పాల్గొంటాడని అంటున్నారు. ఇక, కన్నడంలోనూ దీన్ని విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే సుదీప్‌ను తీసుకున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X