ఎన్టీఆర్, చరణ్‌కు ధీటైన విలన్ అతడేనా.. 'ఆర్ఆర్ఆర్'లో క్రేజీ హీరో!
Recommended Video

బాహుబలి చిత్రంతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు రాజమౌళి. ఈ చిత్రంతో దర్శకధీరుడి ఖ్యాతి కూడా దశదిశలా వ్యాపించింది. రాజమౌళి ఇప్పుడు మరో అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. 300 కోట్ల కళ్ళు చెదిరే బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది కానీ నటీనటుల గురించి ఇంకా వివరాలు తెలియలేదు. రాజమౌళి సినిమా అంటే హీరోలకు ధీటుగా విలన్ పాత్ర ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో విలన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఇద్దరు స్టార్ హీరోలతో
రాజమౌళి ఇప్పటి వరకు చేసిన చిత్రాలు ఒక ఎత్తు.. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో ఇద్దరు బడా హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంది. పైగా ఈ ఒక్క చిత్రానికే 300 కోట్ల భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ చిత్రానికి విజజయేంద్ర ప్రసాద్ అందించిన కథ గురించి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

ధీటైన విలన్ ఎవరు
ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలకు తగ్గట్లుగానే ఈ చిత్రంలో విలన్ పాత్రని తీర్చిదిద్దుతాడు అనడంలో సందేహం లేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ లో విలన్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. రోజు రోజుకు తన స్టార్ డమ్ పెంచుకుంటున్న కన్నడ యువహీరో యశ్ ఈ చిత్రంలో విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

క్రేజీ హీరోగా
యశ్ కన్నడలో పలు చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. యశ్ నటిస్తున్న తాజా చిత్రం కెజిఎఫ్ త్వరలో తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రంలో రానాని భయంకరమైన భల్లాల దేవుడిగా చూపించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం భారీ ఆహార్యం ఉండే యశ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వార్తల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రీరిలీజ్ ఈవెంట్
యశ్ తొలిసారి కెజిఎఫ్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్యఅతిధిగా హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











