మహేష్ తలపడేది ఆ స్టార్ హీరోతోనా.. సర్కారు వారి పాటకు అదిరే స్కెచ్!!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబు.. తదుపరి ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాలున్నాయి.అసలే ఈ కథ, ప్రాజెక్ట్ కోసం ఎన్నో ట్విస్టులు జరిగాయి. చివరి నిమిషం వరకు అంతా ఉత్కంఠగానే మారింది. వంశీ పైడిపల్లీ సైడ్ అయిపోవడం, పరుశురామ్ లైన్‌లోకి వచ్చే వరకు జరిగిన విషయాలెన్నో. మొత్తానికి వీరి కాంబోలో ప్రాజెక్ట్ సెట్ అయింది.

సర్కారు వారి పాట..
మహేష్ బాబు-పరుశురామ్ ప్రాజెక్ట్ సెట్ అయిందని బయటకు వచ్చినప్పుడు టైటిల్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. పరుశురామ్ సినిమాలంటే సాఫ్ట్ టైటిల్స్ ఉంటాయని అంతా భావించడంతో మహేష్ కోసం ఎలాంటిది ఫిక్స్ చేశాడోనని అందరూ ఎగ్జైట్ అయ్యారు. సర్కారు వారి పాట అని టైటిల్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

సుదీప్ అంటూ వార్తలు..
మహేశ్ బాబు సినిమా అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అందుకే ప్రతి సినిమాలో ఆ స్థాయికి తగ్గ ప్రతినాయకులను తీసుకుంటారు. అయితే పరుశురామ్ రెడీ చేసిన ప్రాజెక్ట్ కోసం కూడా ఓ సూపర్ స్టార్‌నే తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని లీకులు కూడా వచ్చేస్తున్నాయి. మొదటగా కిచ్చా సుదీప్ విలన్‌గా నటించబోతోన్నాడనే వార్తలు వినిపించాయి.

ఇప్పుడు ఉపేంద్ర..?
అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం తెలుగు నాట బాగా సుపరిచితుడైన ఉపేంద్రను ఆ పాత్రకు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఉపేంద్ర ఇప్పటికే సన్నాఫ్ సత్యమూర్తితో ఓ అద్భుతమైన పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మహేష్ బాబుతో ఉపేంద్ర తలపడితే అది కచ్చితంగా సెన్సేషనే.

ఇప్పట్లో నో షూటింగ్..
షూటింగ్‌లు చేసుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో కొందరు సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. కానీ మహేష్ మాత్రం ఇప్పట్లో షూటింగ్ వద్దని ఖరాఖండిగా చెప్పేశాడట. కరోనా ఉధృతి తగ్గేవరకు షూటింగ్ జోలికి వెళ్లొద్దని ఫిక్స్ అయ్యాడట.


Click it and Unblock the Notifications











