Kantara దర్శకుడికి అల్లు అరవింద్ బంపర్ ఆఫర్.. మళ్ళీ అలాంటి కంటెంట్ తోనే?

కాంతార సినిమాతో ఇప్పుడు దేశవ్యాప్తంగా దర్శకుడు పేరు హీరో పేరు వైరల్ గా మారిపోతోంది. ఒకవైపు దర్శకుడిగా అద్భుతమైన సినిమాను ప్రజెంట్ చేసి మరోవైపు సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచిన రిషబ్ శెట్టికి ఇప్పుడు మామూలు క్రేజ్ రావడం లేదు. అతను ఏ భాషలోకి వెళ్ళినా కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట కన్నడలో ఏదో మీడియం బడ్జెట్ తరహాలో విడుదలైన కాంతార సినిమా అక్కడ ఊహించని విధమైన కలెక్షన్స్ అందుకుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 100 కోట్లను కలెక్ట్ చేయడంతో అందరి దృష్టి అతనిపై పడింది. తెలుగులో కూడా కాంతార సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఇక తమిళ్ మలయాళం భాషల్లోనే కాకుండా హిందీలో కూడా కాంతార సినిమాకు ఓవర్గం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా భాషాతో సంబంధం లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు.

Kantara director rishab shetty new project in allu aravind geetha arts

అయితే తెలుగులో ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ లోనే ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయడం ఒక విధంగా సినిమాకు బాగా కలిసి వచ్చింది. బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం అంటే మార్కెట్లో మంచి వ్యాల్యూ ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఇక అల్లు అరవింద్ ఈ సినిమాను మొదట కొన్ని థియేటర్లలో విడుదల చేసి మంచి టాక్ వచ్చిన తర్వాత థియేటర్ల సంఖ్యను కూడా పెంచారు.

Kantara director rishab shetty new project in allu aravind geetha arts

అయితే సినిమా చూసిన తర్వాత రిషబ్ శెట్టితోనే ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ఇదివరకే ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే రిషబ్ శెట్టి కాంతార సినిమా తరహాలోనే ఒక థ్రిల్లర్ యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక టాక్ ప్రకారం అయితే అది కాంతార సినిమాకు సీక్వెల్ అని కూడా అంటున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే తెరపైకి తీసుకు రావాలని అనుకుమతున్నారట. మరి ఈ అనుమానాలన్నిటిపై క్లారిటీ రావాలి అంటే అధికారికంగా మరొక క్లారిటీ ఇవ్వాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X