టాలీవుడ్ లో అడుగుపెడుతున్న కన్నడ స్టార్ హీరో.. ఆ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా?
తెలుగు చిత్ర సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో పోటీ పడడమే కాకుండా.. భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. RRR లాంటి సినిమాలు ఆస్కార్ బరిలో కూడా నిలుస్తున్నాయి. టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్లు సూపర్ స్టార్స్ ఫ్యాన్ ఇండియా హీరోలు మారారు. ఈ తరుణంలో ఓ కన్నడ స్టార్ హీరో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఓ భారీ బడ్జెట్ మూవీ మేకర్స్ స్ట్రైయిట్ తెలుగు సినిమాలో నటించనున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ప్రముఖ మూవీ నిర్మాణ సంస్థ ఏంటి? వివరాల్లోకి వెళ్తే..
కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ మారిపోయింది. తెలుగు హీరోలు, దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఆ సినిమాలతోనే భారీ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో స్ట్రైట్ మూవీస్ లలో నటిస్తూ.. భారీ సక్సెస్ అందుకుంటున్నారు. ప్రస్తుతం మరో మూవీ కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ హీరో బాటలో మరో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కూడా నడవడానికి ప్రయత్నిస్తున్నాడు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాంతారా సినిమాతో నటుడుగా, దర్శకుడుగా ఫ్యాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. తెలుగులోనూ కాంతారా మూవీ భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా కాంతారా 2 సినిమా కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు రిషబ్ శెట్టి.
మరోవైపు ప్రశాంత్ వర్మతో తన తెలుగు సినిమాను ప్రకటించారు రిషబ్ శెట్టి. తేజ సబ్జా లీడ్ రోలో నటించిన 'హనుమాన్' భారీ సక్సెస్ అందుకున్నారు. చిన్న మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. దీంతో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా 'జై హనుమాన్' సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్ అయినా హనుమంతుని పాత్రలో రిషబ్ శెట్టి నటించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన ఆదరణ లభించింది.

ఇక రిసెప్ట్ శెట్టి తన రెండవ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 'ఆకాశవాణి' మూవీ ఫ్రేమ్ అశ్విని గంగరాజు డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో రిషబ్ శెట్టి నటించబోతున్నారట. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను భారీ మూవీ మేకర్స్ సితార ఎంటర్టైనేర్స్ నిర్మించబోతుందట. ఈ క్రేజీ ప్రాజెక్టు అధికార ప్రకటన త్వరలో రాబోతుందన్నట్లు ప్రచారం జరుగుతుంది.


Click it and Unblock the Notifications











