కంత్రి ఆమెకి కలిసొచ్చింది

కంత్రి సినిమా గురించి బెంగాల్ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఒకటి రెండు పత్రికల్లో రివ్యూలు కూడా వచ్చాయి. విషయమేమిటని ఎంక్వైరీ చేస్తే ఆమె బెంగాళి కావటంతో అక్కడా కంత్రికి ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చిందిట. తనీషా పాతతరం హీరోయిన్ తనూజ చిన్న కూతురు. కాజోల్ చెల్లెలు. అంతేగాక తనీషా తండ్రి బెంగాళి సినీ ప్రముఖుడు. దాంతో అక్కడి పత్రికలు మీడియా కంత్రి ప్రారంభం నుండి మనమ్మాయి తెలుగులో పెద్ద హీరో ప్రక్కన ఛాన్స్ సంపాదించింది అంటూ పబ్లిసిటి ప్రారంభించాయి. దాంతో హఠాత్తుగా అక్కడ ఆమెకు కొత్త క్రేజ్ వచ్చిపడింది. దాంతో పాటే ఉత్సాహవంతులైన కొందరు నిర్మాతలు ఆఫర్లతో ముందు కొచ్చారు. దాంతో కంత్రి డివైడ్ తెచ్చుకున్నా తనీషాకు కలిసి వచ్చినట్లయింది. అందులోనూ తనీషా కంత్రి లో కనపడేది కొద్ది సేపైనా సాథ్యమైనంత ఎక్స్ పోజింగ్ తో కళ్ళల్లో నిలిచి పోయేలా నటించింది. అంతేగాక ఈమె కోసం కంత్రి చూసిన బెంగాళి వాళ్ళు ఎన్టిఆర్ నటన,ఎనర్జీ చూసి అబ్బురపడ్డారట.


Click it and Unblock the Notifications











