twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంత్రి ఆమెకి కలిసొచ్చింది

    By Staff
    |

    Taneesha
    కంత్రి హిట్టయిందా ...రెవెన్యూ వస్తోందా అనే విషయాలు ప్రక్కన పెడితే అందులో హీరోయిన్ లు ఇద్దరికి బాగా కలిసివచ్చింది. హన్సిక ఆల్రెడి పెద్ద సినిమాలు కమిట్ అవుతూ బిజీగా ఉంది. ఇక సెకెండ్ హీరోయిన్ గా చేసిన తనీషా కెరీర్లో కూడా కదలిక తెస్తోంది. అసలు ఆమె తెరంగ్రేటం Sssshhh అనే ఫ్లాప్ సినిమాతో ప్రారంభమైంది. తర్వాత చేసిన 'పాప్ కార్న్ కహో మస్త్ హో జావో', 'టాంగో చార్లీ' కలసి రాలేదు. కాస్తలో కాస్త సర్కార్ రాజ్, నీల్ ఔర్ నిక్కీ బెటరనిపించాయి. ఈ దశలో కంత్రి నిర్మాతలు వచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజైంది. కాని తెలుగు నిర్మాతలు ఎవరూ ఫోన్ కూడా చెయ్యకపోవటంతో నిరాశలో ఉంది. ఇంతలో ఊహించని విధంగా

    కంత్రి సినిమా గురించి బెంగాల్ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఒకటి రెండు పత్రికల్లో రివ్యూలు కూడా వచ్చాయి. విషయమేమిటని ఎంక్వైరీ చేస్తే ఆమె బెంగాళి కావటంతో అక్కడా కంత్రికి ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చిందిట. తనీషా పాతతరం హీరోయిన్ తనూజ చిన్న కూతురు. కాజోల్ చెల్లెలు. అంతేగాక తనీషా తండ్రి బెంగాళి సినీ ప్రముఖుడు. దాంతో అక్కడి పత్రికలు మీడియా కంత్రి ప్రారంభం నుండి మనమ్మాయి తెలుగులో పెద్ద హీరో ప్రక్కన ఛాన్స్ సంపాదించింది అంటూ పబ్లిసిటి ప్రారంభించాయి. దాంతో హఠాత్తుగా అక్కడ ఆమెకు కొత్త క్రేజ్ వచ్చిపడింది. దాంతో పాటే ఉత్సాహవంతులైన కొందరు నిర్మాతలు ఆఫర్లతో ముందు కొచ్చారు. దాంతో కంత్రి డివైడ్ తెచ్చుకున్నా తనీషాకు కలిసి వచ్చినట్లయింది. అందులోనూ తనీషా కంత్రి లో కనపడేది కొద్ది సేపైనా సాథ్యమైనంత ఎక్స్ పోజింగ్ తో కళ్ళల్లో నిలిచి పోయేలా నటించింది. అంతేగాక ఈమె కోసం కంత్రి చూసిన బెంగాళి వాళ్ళు ఎన్టిఆర్ నటన,ఎనర్జీ చూసి అబ్బురపడ్డారట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X