Devara Story: దేవరలో సంచలన సంఘటన.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అలా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా!

టాలీవుడ్‌కు చెందిన హీరోలు గ్లోబల్ రేంజ్‌ను అందుకుంటున్నారు. తద్వారా తమ క్రేజ్‌ను, మార్కెట్‌ను విశ్వవ్యాప్తం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న అతడు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తన 30వ చిత్రంగా 'దేవర'ను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

'దేవర'గా వస్తున్న ఎన్టీఆర్:ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సినిమానే 'దేవర'. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, ఇందులో ఎంతో మంది ప్రముఖులు భాగం అయ్యారు.

Karamchedu Massacre Reference in Jr NTR Devara Movie

యమ స్పీడుతోనే షూటింగ్:ఎన్టీఆర్ 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన నాలుగు భారీ యాక్షన్ షెడ్యూళ్లను యమ స్పీడుగా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇలా వీలైనంత త్వరగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేయాలని చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది.

Karamchedu Massacre Reference in Jr NTR Devara Movie

కోస్టల్ బ్యాగ్‌డ్రాప్.. యాక్షన్:పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ ఇండియాలో ఎవరూ చూడని కోస్టల్ ఏరియా (సముద్ర భాగం)కు సంబంధించిన బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. ఈ విషయాన్ని కొరటాల శివ ముందే రివీల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఇందులో పెట్టబోతున్నారు.

సోషల్ మెసేజ్‌ ఎపిసోడ్‌లు:సాధారణంగా కొరటాల శివ సినిమాలు అంటేనే సోషల్ మెసేజ్‌లతో కూడి ఉంటాయి. అయితే, తొలిసారి ఎన్టీఆర్ కోసం ఆయన 'దేవర'లో ఎలాంటి సందేశాలు ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది. కానీ, ఈ సినిమాలో కూడా ఆయన కొన్ని సోషల్ మెసేజ్‌తో కూడిన ఎపిసోడ్స్‌ను పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాస్ట్ సిస్టమ్‌పై కొరటాల ఫోకస్ చేస్తున్నారని టాక్.

Karamchedu Massacre Reference in Jr NTR Devara Movie

దేవరలో కారంచేడు ఘటన:సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న 'దేవర' మూవీలో 1985లో జరిగిన సంచలన సంఘటన 'కారంచేడు ఊచకోత' ఎపిసోడ్‌ను సూచించే సన్నివేశాలను పెట్టినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అయితే, కచ్చితంగా ఇవే సన్నివేశాలను చూపించకున్నా.. దానిని గుర్తు చేసేలా ఉండే సీన్స్‌ను మాత్రం చూపించబోతున్నారని ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Karamchedu Massacre Reference in Jr NTR Devara Movie

ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చేలా ప్లాన్:'దేవర' మూవీలో క్యాస్ట్ సిస్టమ్ గురించి వచ్చే సన్నివేశాలను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చూపించే అవకాశం ఉందని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో అగ్ర కులాల వాళ్లకు, దళితులకు మధ్య జరిగే పోరాటాన్ని హైలైట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఎన్టీఆర్ పాత్ర ప్రజలను చైతన్యం చేసే విధంగా వ్యవహరిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Karamchedu Massacre Reference in Jr NTR Devara Movie

ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?:1985లో 'కారంచేడు ఘటన' జరిగినప్పుడు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన దళితుల కోసం చాలా కొత్త చట్టాలను తీసుకు వచ్చారు. అయినప్పటికీ ఇది ఆయన ప్రభుత్వానికి మచ్చలా ఉండిపోయింది. ఇప్పుడు 'దేవర' ఈ ఎపిసోడ్ చూపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X