ప్రభాస్ నిర్ణయానికి కరణ్ జోహార్ అప్సెట్.. ఇచ్చిన మాట తప్పినట్లేనా?
ఇండియన్ బాక్సాఫీస్ స్టామినను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. ఆ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ మూవీ అనేదానికి అసలైన అర్థం చెప్పిన సినిమా. అయితే ఆ సినిమా విజయంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పాత్ర చాలానే ఉందనే చెప్పాలి. అప్పట్లో కరణ్ చేసిన హెల్ప్ కి బాహుబలి టీమ్ మొత్తం ఫిదా అయ్యింది. అయితే అలాంటి కరణ్ ప్రస్తుతం ప్రభాస్ నిర్ణయానికి గట్టిగానే హార్ట్ అయ్యాడట.
Recommended Video

ధర్మ ప్రొడక్షన్ అంటేనే..
సినిమాను వరల్డ్ వైడ్ గా ఎలా రిలీజ్ చెయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయంలో కరణ్ జోహార్ థింకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సౌత్ ఇండియన్ సినిమాలను బాలీవుడ్ లో భారీగా రిలీజ్ చేయాలి అంటే అది కరణ్ జోహార్ వల్లే సాధ్యం అవుతుందనే ఒక బ్రాండ్ సెట్టయ్యింది. అయితే ఇప్పుడు మాత్రం ధర్మ ప్రొడక్షన్ అంటేనే బాలీవుడ్ వల్లే ఇంట్రెస్ట్ చూపడం లేదు.

నెపోటిజమ్ దెబ్బకు..
నెపోటిజమ్ సామ్రాజ్యానికి ఉపిరిపోస్తోంది ముఖ్యంగా కరణ్ జోహార్ లాంటి వాళ్లేనని గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో అనేక రకాల కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మెయిన్ గా కంగనా రనౌత్ అయితే ఉతికారేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ అనంతరం కరణ్ కి ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు.

ప్రభాస్ తో సినిమా చేయాలని..
కరణ్ జోహార్ పై ప్రస్తుతం నెగిటివ్ కామెంట్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే సాహో తరువాత కరణ్ జోహార్, ప్రభాస్ తో ఒక సినిమాను చేయాలని అనుకున్నాడు. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా కథకు వినిపించినప్పటికి ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక రాధేశ్యామ్ అనంతరం ఎలాగైనా మిస్ అవ్వకూడదని ప్రభాస్ తో చర్చలు జరుపుతున్న తరుణంలో ప్రభాస్ వెంటనే నాగ్ అశ్విన్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కరణ్ జోహార్ అప్సెట్
రీసెంట్ గా రామాయణం బ్యాక్ డ్రాప్ ఓ రావత్ చెప్పిన ఆది పురుష్ కథకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కరణ్ జోహార్ చాలా అప్సెట్ అయ్యాడట. బాహుబలికి ఎంతో సహాయం చేస్తే కనీసం తనకు ఒక క్లారిటీ కూడా ఇవ్వకుండా ప్రభాస్ వేరే వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడంతో ఆయన చాలా హార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ మాత్రం కరణ్ జోహార్ నెపోటిజమ్ ఉచ్చులో ఉన్నందున ఆయనకు దూరంగా ఉండడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











