టాలీవుడ్ మీద కన్నేసిన కరణ్ జోహార్.. మరో భారీ బడ్జెట్ సినిమాలో వాటా.. అధికారికంగా ప్రకటన కూడా?

తెలుగు సినిమా సత్తా ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలిసొచ్చింది. ఇప్పుడు 90 ఏళ్ల కాలంలో తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతూ ఉండేవి కానీ ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా విడుదల అవుతూ అక్కడ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. బాహుబలి తో మొదలైన ఈ ట్రెండ్ మొన్న పుష్ప తో మరింత ముదిరింది అని చెప్పవచ్చు.. దీంతో ఇప్పటి దాకా భారతదేశం మొత్తం మీద అతి పెద్ద సినీ పరిశ్రమగా భావిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు సైతం ఇప్పుడు తెలుగు సినిమా మీద ఫోకస్ పెడుతున్నారు.. అందులో భాగంగా బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తెలుగు సినిమాలలో వాటాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఒక ప్రతిష్టాత్మక సినిమా వాటా దక్కించుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

మెచ్చే విధంగా

మెచ్చే విధంగా


బాహుబలి సిరీస్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత చేస్తున్న ప్రతి సినిమా దాదాపు పాన్ ఇండియాప్రాజెక్టుగా మారుతోంది. బాహుబలి తర్వాత సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ సాధించాడు. సినిమా మీద అంచనాలు భారీగా ఉండటంతో, కథ విషయంలో కొంత మేర ప్రేక్షకుల అభిరుచిని ఆకట్టుకోలేకపోయారు.. దీంతో ప్రభాస్ చాలా జాగ్రత్తగా రాధేశ్యామ్ సినిమా ఆలస్యం అయినా పర్వాలేదు అని భావించి తెలుగు ప్రేక్షకులు సహా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు మెచ్చే విధంగా తయారు చేశారు.

'ప్రాజెక్ట్ K'

'ప్రాజెక్ట్ K'


నిజానికి ఈ సినిమా జనవరి నెలలో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా మూడో దశ కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ ఏడాది వేసవి కాలంలో సినిమా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ప్రభాస్ అనేక సినిమాల ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క 'ఆదిపురుష్', 'సలార్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య అమితాబ్, దీపికా, ప్రభాస్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

కరణ్ జోహార్ కూడా

కరణ్ జోహార్ కూడా

అలా ఒక షెద్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అంతే కాక ఈ సినిమాకు దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించపోతున్నారు అని తెలుస్తోంది. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒకప్పటి స్టార్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు కూడా పనిచేశారు. దీంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. అమితాబచ్చన్ కీలకపాత్రలో దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ఈ సినిమాలో కరణ్ జోహార్ కూడా భాగం అవుతున్నారని తెలుస్తోంది.

అధికారికంగా కూడా

అధికారికంగా కూడా

నిజానికి హిందీ పరిశ్రమలో కరణ్ జోహార్ పాత్ర పెద్దది. ఆయన ప్రొడక్షన్స్ నుంచి పదేళ్ల నుంచి ఏడాదికి కనీసం తక్కువలో తక్కువ మూడు సినిమాలు అయినా విడుదల అవుతూ ఉంటాయి. తెలుగు తారలతో కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆయన బాహుబలి సినిమాను ప్రమోట్ చేశారు.. ఇప్పుడు RRR సినిమా విషయంలో కూడా హిందీలో ప్రమోషన్స్ దాదాపు ఆయనే చూసుకుంటున్నారు.. అంతేకాక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ తను ప్రాజెక్ట్ కే లో భాగం అవుతా అని చెప్పడంతో అశ్వినీదత్ పెద్దగా ఆలోచించకుండానే ఆయనకూ వాటా ఇవ్వడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. సౌత్ నుంచి ఏ సినిమా హిందీలో రిలీజ్ కావాలన్నా.. కరణ్ హెల్ప్ ఉండాల్సిందేనని మన నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు దాదాపు పూర్తయ్యాయని త్వరలోనే రాతకోతలు కూడా పూర్తి అయితే అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended Video

Bollywood : NCB Asks Karan Johar To Explain 2019 Party Video
భారీగా లాభాలు

భారీగా లాభాలు


నిజానికి ప్రస్తుతానికి ప్రభాస్ చేస్తున్న అత్యధిక సినిమాలు టి సిరీస్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్, ఆది పురుష్ , స్పిరిట్ సినిమాల్లో వారు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే తెలుగు నుంచి హిందీ కి రీమేక్ అవుతున్న దాదాపు అన్ని తెలుగు సినిమాల్లో కూడా టి సిరీస్ భాగస్వాములుగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళుతున్న దాదాపు అన్ని సినిమాలు అక్కడ కూడా సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో మార్కెట్లో మరింత తన పరిధిని విస్తరించు కోవాలి అంటే దానికి తెలుగు సినిమాలు బాగా ఉపయోగపడతాయని కరణ్ జోహార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా బాలీవుడ్ లో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్న ఆయన తెలుగు సినిమాలను నేరుగా అక్కడ ప్రెజెంట్ చేయడమేకాక వాటాలు కూడా పెడితే భారీగా లాభాలు ఆర్జించవద్దు అని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు కే సినిమాలో ఆయన భాగం అయినట్లు తెలుస్తోంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X