మతం మార్చుకుంటున్న ‘హీరోయిన్’?
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన సహచర నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో వీరి వివాహం జరుగబోతోంది. తాజాగా కరీనా మీడియాతో మాట్లాడుతూ పలు అనుమానాలకు తెర లేపింది. సైఫ్‌తో వివాహం తర్వాత తన పేరును 'కరీనా కపూర్ ఖాన్'గా మార్చుకుంటానని వెల్లడించింది.
అయితే 'కపూర్' అనే తన సర్ నేమ్ మాత్రం మార్చుకోనంటోంది. బాలీవుడ్లో ఆ పేరుకు చాలా పవర్ ఉండటమే అందుకు కారణం. కాగా...కరీనా కపూర్ కాబోయే భర్త సైఫ్ కోసం మతం మార్చుకోబోతోందని, ఇస్లాం స్వీకరించనుందనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
నాలుగైదేళ్లుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌కు ఇప్పటికే పెళ్లయి విడాకులు అయ్యాయి. అతనికి పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అలాంటిది ఆయన కరీనాతో పెళ్లికి రెడీ అవుతుండటం... దానికి కరీనా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఓకే చెప్పేయడం విశేషం. అఫ్ కోర్స్ కరీనా కూడా గతంలో షాహిద్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిందనుకోండి.
గతంలో అక్టోబర్ 16న అనుకున్నప్పటికీ చివరకు అక్టోబర్ 17ను ఫిక్స్ చేసారని అంటున్నారు. ఆ రోజు వరకు సైఫ్, కరీనా చేతుల్లో ఉన్న సినిమాలు పూర్తవుతాయట..! అదీకాక అప్పటికి సైఫ్ తండ్రి నవాబ్ పటౌడీ చనిపోయి ఏడాది కూడా పూర్తవుతుందట..! సో.. అక్టోబర్ 17 నాటికి అన్ని అవాంతరాలు అధిగమించి సైఫ్-కరీనా జంట ఒక ఇంటివారు కానున్నారన్నమాట..!


Click it and Unblock the Notifications











