twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయేంద్ర ప్రసాద్ 'సీత'కి కరీనా కండిషన్స్.. ఆ విషయంలో తగ్గేదేలే!

    |

    సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఎక్కువగా పురాణాలు ఇతిహాసాలు ఆధారంగా చేసుకొని సినిమాలు తెరకెక్కించే పనిలో పడింది. బాషతో సంబంధం లేకుండా ఇప్పటికే టాలీవుడ్ సహా బాలీవుడ్ లో కూడా చాలా ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రాజమౌళి తండ్రి కధ అందిస్తున్న సీత అనే సినిమా కోసం ఎంపిక అయిందని అంటున్నారు. అయితే తాజాగా ఈ విషయానికి సంబంధించి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాహుబలి లాంటి భారీ చిత్రాలకు కథలు అందించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు సీత అనే పేరుతో తెరకెక్కబోతున్న సినిమాకి కథ అందించారు.

    రామాయణ ఇతిహాసంలో రాముడి భార్య అయిన సీత కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఆమె ఆ పాత్ర చేసేందుకు రెండు కండిషన్లు కూడా పెట్టగా ఆ రెండు కండిషన్లకు నిర్మాతలు ఒప్పుకున్నారని అంటున్నారు. అందులో మొదటి కండిషన్ ఏమిటంటే ప్రస్తుతం తాను చేస్తున్న అన్ని సినిమాలు పూర్తి అయ్యాకనే సీత సినిమా మొదలు పెడతానని ఆమె కండిషన్ పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వీరే కి వెడ్డింగ్ సీక్వెల్ అలాగే మరో పేరు పెట్టని సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. సదరు పేరు పెట్టని సినిమాకి హన్సల్ మెహతా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

    Kareena Kapoor Khan demands Rs 12 crore to do vijayendra prasads Sita

    మరో రెండు, మూడు నెలల్లో ఈ రెండు సినిమాల షూటింగులు పూర్తి చేస్తానని ఆ తర్వాత మాత్రమే సీత షూటింగ్ కి హాజరు కాగలరని ఆమె తేల్చి చెప్పిందట. ఈ కండీషన్ కి మేకర్స్ ఒప్పుకున్నారని అంటున్నారు. అంతేకాక సీత సినిమా కోసం దాదాపు 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆమె డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా కరీనా కపూర్ ప్రతి సినిమాకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ సీత సినిమా చేయడం కోసం చాలా రోజులు కష్టపడాల్సి వస్తుంది అలాగే వీలైనన్ని ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వస్తుందని అందుకే కారణంగా ఆమె దాదాపు డబుల్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కూడా ఆమె డిమాండ్స్ కి ఒప్పుకున్నారని తెలుస్తోంది. అలౌకిక దేశాయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు.

    English summary
    Indian film industry is focussing more on historical and mythological dramas now. Sita written by vijayendra prasad will showcase Ramayana from the perspective of Sita. but Kareena Kapoor Khan demands Rs 12 crore to do the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X