కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?

దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. పలు రాజకీయ పార్టీలు ఎలక్షన్స్‌లో గెలిచేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పార్టీల సీనీ తారలను ఎన్నికల ప్రచారంలో వాడుకొనేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు ఏకంగా పార్టీ తరఫున పోటీ చేయించేందుకు సిద్దమవుతున్నారు. దాంతో ఈ సారి ఎన్నికలకు సినీ తారల హంగులు, అర్బాటాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారు అనే విషయం మీడియా వర్గాల్లో హాట్ హాట్ న్యూస్ ప్రచారంలో ఉంది. ఆ వివరాల్లోకి వెలితే..

ఇప్పటికే బాలీవుడ్ నుంచి కంగన రనౌత్‌ను ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రంగంలోకి దించింది. ఆమెను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో గత కొద్దికాలంగా ఆమె రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు బలం చేకూర్చింది.

Kareena kapoor Khan to join in Shiv Sena Of Eknanth Shinde

ఇక హిందీ సినీ పరిశ్రమ నుంచి మరో స్టార్ హీరోయిన్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అయితే కరీనా కపూర్ కూడా మహారాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలోకి ఆమె చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నది అని రాజకీయ, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.

కరీనాకపూర్‌ను ముంబైలోని పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు శివసేన సిద్దమవుతున్నది. ఏక్‌నాథ్ షిండేతో ఆమె చర్చలు జరుపుతున్నది. ఒకట్రెండు రోజుల్లో ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే న్యూస్ ప్రచారం జరుగుతున్నది.

Kareena kapoor Khan to join in Shiv Sena Of Eknanth Shinde

ఇదిలా ఉండగా, కరీనా కపూర్ నటించిన క్రూ చిత్రం మార్చి 29 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో టబు, కృతిసనన్ కూడా నటించారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సానుకూలంగా జర్నీని మొదలుపెట్టే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీనా రాజకీయ ప్రవేశం ఎంట్రీ వార్త మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X