Spirit: ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్.. ఇద్దరు బిడ్డల తల్లైనా అలాంటి సీన్స్ చేస్తుందట
తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ఈ హీరో.. ఇండియన్ సినిమాను శాసించే దిశగా సాగిపోతున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్టులను ప్రకటించిన ప్రభాస్.. ఇటీవలే తన 25వ సినిమాను కూడా అనౌన్స్ చేసేశాడు. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

‘రాధే శ్యామ్’ అంటోన్న ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం రెండు చిత్రాలకు బిజీగా
ఈ మధ్య కాలంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఒక పక్క ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే మూవీని చేస్తున్నాడు. ఈ రెండింటికి సంబంధించిన షూటింగ్‌లలో వీలును బట్టి పాల్గొంటున్నాడు. ఇందులో ఆదిపురుష్ దాదాపుగా పూర్తి కావొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

పాన్ వరల్ట్ సినిమాలో రెబెల్ స్టార్
ప్రభాస్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేసే మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందనుంది. ఇందులో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, సినిమా టైం మెషీన్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన 'ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది వచ్చే ఏడాది స్టార్ట్ కానుందని టాక్.

మరో బాలీవుడ్ డైరెక్టర్‌కు సిగ్నల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను మొదలు పెట్టిన ఈ స్టార్ హీరో.. తన 24వ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీన్ని బాలీవుడ్ డైరెక్టర్ 'వార్' ఫేం సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలిసింది.

మన డైరెక్టర్‌తో హై రేంజ్ మూవీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు. దీని భూషన్ కుమార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ నటి
'స్పిరిట్' మూవీ భారీ యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే టైటిల్‌పై స్టార్స్ ఉండడంతో ఇది పోలీస్ కథతో వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్‌గా నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది.
Recommended Video

ఇద్దరు బిడ్డల తల్లైనా అలాంటివి
అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసిన కరీనా కపూర్.. ఈ మధ్యనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పిరిట్ మూవీ కోసం ఆమె సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించబోతుందట. అందుకు కొన్ని నెలలు శిక్షణ తీసుకోనుందని టాక్.


Click it and Unblock the Notifications











