For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కార్తీ, నాగార్జున చిత్రం ఫ్రెంచ్ చిత్రం ఫ్రీమేకా?

  By Srikanya
  |

  హైదరాబాద్: అక్కినేని నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో ఒక చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. పి.వి.పి. సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లిదర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ ఓ ఫ్రెంచ్ సూపర్ హిట్ ఆధారంగా రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 2011 లో వచ్చిన The Intouchables ఆధారంగా ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

  ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు సీనియర్,మరొకరు జూనియర్. ఈ చిత్రం ఫన్ తో కూడిన డ్రామా గా నడుస్తుంది. అయితే ఈ విషయం నిజమా కాదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని పి.వి.పి సంస్ధ తీసుకుందని మరో వార్త వినపడుతోంది. అదే నిజమైతే అఫీషియల్ రీమేక్ గా చెప్పుకోవాలి. ఇప్పటివరకూ ఈ విషయమై అదికారికంగా ఏ సమాచారమూ లేదు.

  ఇక ఈ చిత్రం కోసం ఇంతకు ముందు నాగార్జున, జూ.ఎన్టీఆర్‌ కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. చివరికి కార్తీని ఎంపికచేశారు. నాగార్జునకు, కార్తీకి రెండు భాషల్లో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బృందావనం, ఎవడు వంటి హిట్‌ చిత్రాలు అందించిన వంశీ పైడిపల్లి ఇద్దరి హీరోలకు కథ చెప్పి అంగీకరించపజేశారు. కొత్త చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  Karthi, Nagarjuna bilingual is a French remake?

  ఇక కార్తీని సీన్ లోకి తీసుకురావటం వెనక కూడా ఓ స్టాటజీ ఉందంటున్నారు. ఓ తెలుగు సూపర్‌స్టార్‌, ఓ తమిళ సూపర్‌స్టార్‌ ఒకే సినిమాలో ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది..ఖచ్చితంగా భాక్సాఫీస్ వద్ద కన్నుల పండువగానూ ఉంటుందని అంటున్నారు. అందులోనూ కూల్ కామెడీని డీల్ చేయటంలో కార్తీ తీరే వేరు. అది ప్లస్ అయ్యి...బాక్సాఫీస్‌ వసూళ్లు కూడా అదిరిపోతాయి. దాంతో తెలుగు, తమిళ్‌ రెండు మార్కెట్లన గుప్పిట్లోకి తెచ్చుకున్నట్టే. సరిగ్గా అలాంటి ప్రణాళికనే వేసింది పివిపి సంస్థ.

  అక్కినేని నాగార్జున, కార్తీ కలయికలో పివిపి సినిమాస్‌ ఈ భారీ మల్టీస్టారర్‌కి సన్నాహాలు చేస్తోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. అత్యున్నత సాంకేతిక విలువలతో, రాజీ లేకుండా తెరకెక్కించడానికి పివిపి సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఇతర వివరాల్ని వెల్లడించనున్నారు. ‘మనం' చిత్రంతో నాగార్జున, ‘మద్రాసు' చిత్రంతో కార్తీ విజయాలు సొంతం చేసుకుని చాలా హుషారులో ఉన్నారు కాబట్టి మార్కెట్‌ పరంగా రెండుచోట్లా భారీ క్రేజు ఏర్పడుతుందని అంతా అంచనాలు వేస్తున్నారు.

  ఇక fతెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేశారనేది టాక్. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం. అయితే అధికారికంగా దర్శకనిర్మాతల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది.

  ఇక గతంలో తెలుగులో నాగార్జున సరసన తమన్నా ఇప్పటివరకు నటించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇదే తొలి సినిమా అవుతుందని నాగార్జున అభిమానులు ఆనందపడుతున్నారు. మరో ప్రక్క కార్తి,తమన్నాలు తమిళంలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అవారా' , ‘సిరుత్తై' (విక్రమార్కుడు రీమేక్) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమన్నా ని తీసుకోవటం వల్ల తమిళంలో కూడా సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతుందని తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

  English summary
  Nagarjuna and Tamil star Karthi are going to share screen space together for the first time in an upcoming Telugu –Tamil bilingual. This bilingual is the official fremake of the French film ‘Intouchables’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X